| Daily భారత్
Logo




"బార్యాభర్తల మధ్య వివాదాల పరిష్కారానికి ఫ్యామిలీ కౌన్సెలింగ్"

News

Posted on 2026-05-11 18:26:59

Share: Share


"బార్యాభర్తల మధ్య వివాదాల పరిష్కారానికి ఫ్యామిలీ కౌన్సెలింగ్"

అశోక్ నగర్‌లో కార్మికులకు మనోవికాస సదస్సు నిర్వహించిన సైకాలజిస్ట్ కె. పున్నంచందర్

డైలీ భారత్, సిరిసిల్ల: మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈరోజు అశోక్ నగర్‌లో కార్మికుల కోసం మనోవికాస సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ పాల్గొని కుటుంబ సంబంధాలు, దాంపత్య జీవితంలో ఏర్పడుతున్న సమస్యలు మరియు వాటి పరిష్కారాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ మాట్లాడుతూ, ప్రస్తుతం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు పెరిగిపోతున్నాయని తెలిపారు. ముఖ్యంగా ఈగో సమస్యలు, పరస్పర అపార్థాలు, ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోవడం, మితి మీరిన స్వేచ్ఛను కోరుకోవడం వంటి కారణాలు కుటుంబ విభేదాలకు దారితీస్తున్నాయని అన్నారు.

ఇలాంటి సమస్యలు ఎక్కువకాలం కొనసాగితే కుటుంబ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడటమే కాకుండా, పిల్లల మానసిక మరియు భావోద్వేగ ఎదుగుదలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు.

 కుటుంబంలో శాంతి, పరస్పర గౌరవం, సహనం, ప్రేమతో కూడిన సంభాషణ ఎంతో ముఖ్యమని చెప్పారు.

భార్యాభర్తల మధ్య తలెత్తే వివాదాల పరిష్కారం కోసం మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్‌లో ప్రత్యేకంగా ఫ్యామిలీ కౌన్సెలింగ్ సేవలు అందిస్తున్నామని తెలిపారు.

 కౌన్సెలింగ్ ద్వారా పరస్పర అవగాహన పెంపొందించి కుటుంబ బంధాలను బలోపేతం చేయవచ్చని పేర్కొన్నారు.

ఫ్యామిలీ కౌన్సెలింగ్ కోసం  8801888805 ను లేదా మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ లో నేరుగా సంప్రదించవలసిందిగా కార్మికులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ సిబ్బంది బూర శ్రీమతి, కొండ ఉమ, రాపెల్లి లత, కార్మికులు పాల్గొన్నారు.

Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >
Image 1

కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!

Posted On 2026-06-15 13:22:45

Readmore >