| Daily భారత్
Logo




సిరిసిల్లలో భూకబ్జా ? ...ముష్టిపల్లిలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై కలెక్టర్‌కు ఫిర్యాదు..

News

Posted on 2026-05-11 18:35:23

Share: Share


సిరిసిల్లలో భూకబ్జా ? ...ముష్టిపల్లిలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై కలెక్టర్‌కు ఫిర్యాదు..

సర్కారు భూమిపై రియల్ ఎస్టేట్ వెంచర్....

విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బాధితుడి విన్నపం..

ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ కలెక్టర్‌కు వినతిపత్రం..

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని ముష్టిపల్లిలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోందని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజీవ్ నగర్‌కు చెందిన కైలాస్ కుమార్ సిరస్వాల్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ముష్టిపల్లిలోని సర్వే నంబర్ 106లో ఉన్న 12.05 గుంటల పట్టా భూమిని ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 51లోని సుమారు రెండు 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది భూకబ్జాదారులు అక్రమంగా ఆక్రమించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత గ్రామ పంచాయతీ పెద్దలు, మరికొందరు అధికారులు కలిసి ఎటువంటి అనుమతులు లేకుండా, లేఅవుట్ ప్లాన్ లేకుండానే ప్రభుత్వ భూమిలో వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్ల రూపంలో విక్రయిస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ స్వప్రయోజనాల కోసం ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే సంబంధిత సర్వే నంబర్లలో భూమిని సర్వే చేయించి, అక్రమదారుల నుండి ప్రభుత్వ భూమిని కాపాడి ప్రజా అవసరాలకు వినియోగపడేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు.

Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >
Image 1

కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!

Posted On 2026-06-15 13:22:45

Readmore >