| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు

News

Posted on 2026-05-11 21:12:14

Share: Share


ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు

డైలీ భారత్, అనంతపురం: అంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో 25 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఇంచార్జ్ హెల్త్ ఆఫీసర్, డి ఈ ఈ బి ఎల్ నరసింహ ప్రజారోగ్య విభాగపు ఎఫ్ వన్ గుమాస్తా సందీప్ చౌత సోమవారం ఎసిబి అధికారులు జరిపిన మెరుపు దాడిలో పట్టుబడ్డారు. నెల రోజులుగా ఎగ్జిబిషన్ అనుమతికై దరఖాస్తు చేసుకున్న బాలభారతి ట్రేడ్ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు రఘు ప్రసాదరావును మంజూరు పత్రం కావాలంటే లంచం ఇవ్వాల్సిందేనని హెల్త్ ఆఫీసర్ బిఎల్ నరసింహ డిమాండ్ చేశారు. ఇంచార్జ్ హెల్త్ ఆఫీసర్ బిఎల్ నరసింహ ఈ ఏడాది రిపబ్లిక్ డే పెరియడ్ ఉత్సవాలలో జిల్లా ఉత్తమ అధికారిగా అప్పటి కమిషనర్ బాలస్వామి సిఫారసుతో సత్కరించబడ్డారు. ఎసిబి డిఎస్పి ప్రసాద్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి ఎల్ నరసింహ చార్జ్ హెల్త్ ఆఫీసర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బాల భారతి ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఎగ్జిబిషన్ ఏర్పాటుకై మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి కోరుతూ నెల రోజుల క్రితం దరఖాస్తు చేసుకున్నారన్నారు. అయితే ఇంచార్జ్ హెల్త్ ఆఫీసర్ బిఎల్ నరసింహ 30 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారన్నారు. నెల రోజులుగా మంజూరు పత్రం కై ఎగ్జిబిషన్ నిర్వాహకుడు రఘు ప్రసాదరావు తిరుగుతున్న పట్టించుకోలేదన్నారు. లంచం ముట్ట చెపితే గాని మంజూరు పత్రం ఇవ్వబోమని హెల్త్ ఆఫీసర్ నరసింహ తేల్చి చెప్పటంతో ఆయన సంప్రదించారన్నారు. సోమవారం లంచం డబ్బులు ఇవ్వటానికి ఎగ్జిబిషన్ నిర్వాహకుడు హెల్త్ ఆఫీసర్ బి ఎల్ నరసింహా ను సంప్రదించగా ఎఫ్ వన్ గుమస్తా సందీప్ చౌత కు ఇవ్వాలని సూచించారు. దీనితో గుమాస్తా సందీప్ చౌరస్తా స్థానిక డిఆర్ డిఏ ప్రాంగణంలోని ఆర్ డి ఓ ఆఫీస్ వద్ద ప్రజారోగ్య విభాగ గుమాస్తా సందీప్ చౌత 25 వేల రూపాయలు లంచం తీసుకున్నారని తెలిపారు. అక్కడి నుంచి గుమస్తా సందీప్ చౌత నేరుగా ఇన్చార్జ్ హెల్త్ ఆఫీసర్ డి ఈ ఈ బిఎల్ నరసింహా ను కలిసి లంచం డబ్బులు అందజేశారు. దీనితో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఎసిబి అధికారులు మున్సిపల్ కార్పొరేషన్ ఇంచార్జ్ హెల్త్ ఆఫీసర్ అయిన డి ఈ ఈ బి ఎల్ నరసింహ గదికి వెళ్లారు. ఆయన గది వద్దకే అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఉన్న ఎఫ్ వన్ గుమాస్తా సందీప్ చౌతాను తీసుకువచ్చారు. రసాయనాలతో లంచం డబ్బులు తీసుకున్న అధికారి నర్సింహను గుమాస్తా సందీప్ చౌతాను తనిఖీ చేసి పట్టుకున్నారు. లంచం డబ్బులను తీసుకోవడంతో వారి చేతులు రంగు మారాయి అదే సమయంలో ఎసిబి సిఐ జయమ్మ ఆధ్వర్యంలో ఇంచార్జ్ హెల్త్ ఆఫీసర్ నరసింహ నివాసముంటున్న అపార్ట్మెంట్లోని ప్లాట్ లో తనిఖీలు చేపట్టారు. డాక్యుమెంట్ల పరిశీలన కొనసాగుతోంది. ప్రస్తుతం నివాసం ఉంటున్న ఫ్లాట్ తో పాటు ఆయనకు ఉన్న ఆస్తి వివరాల బ్యాంక్ అకౌంట్లను ఇతరత్రా ఆదాయ వివరాలను పరిశీలిస్తున్నారు. దీనితో నిబంధనల ప్రకారం తదుపరి చర్యల నిమిత్తం నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. తనిఖీలు ముగిసిన తర్వాత వారిని అరెస్టు చేసి తీసుకెళ్లనున్నారు. ఎసిబి జరిపిన దాడులలో అనంతపురం ఎసిబి డిఎస్పి ప్రసాద్ రెడ్డి సిఐ జయమ్మ కర్నూల్ ఏసీబీ ఎస్సై కృష్ణయ్య తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >
Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >