Posted on 2026-05-11 21:14:13
డైలీ భారత్, కొమురవెల్లి: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి మరియు సర్పంచ్ భర్త ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. కొమురవెల్లి గ్రామానికి చెందిన ఫిర్యాదుదారుడి ప్లాట్‌లో గ్రామ పంచాయతీ వారు డ్రైనేజీ పైప్‌లైన్ వేశారు. ఆ పైప్‌లైన్‌ను అక్కడ నుంచి తొలగించాలనే అధికారిక పని కోసం పంచాయతీ కార్యదర్శి గడ్డం రాజు గౌడ్ పది వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో సోమవారం పక్కా ప్రణాళికతో అధికారులు నిఘా పెట్టారు.
సోమవారం సాయంత్రం 4.40 గంటల సమయంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే లంచం డబ్బులు తీసుకుంటుండగా అధికారులు దాడి చేశారు. పంచాయతీ కార్యదర్శి ఆదేశాల మేరకు సర్పంచ్ గొల్లపల్లి పద్మ భర్త గొల్లపల్లి అంజనేయులు (ఏ-2) ఆ పది వేల రూపాయలను స్వీకరించారు. ఏసీబీ అధికారులు వారిద్దరినీ పట్టుకుని, వారి వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. విధి నిర్వహణలో అవినీతికి పాల్పడి, అనుచిత లబ్ధి పొందేందుకు ప్రయత్నించినందుకు గాను పంచాయతీ కార్యదర్శి రాజు గౌడ్, సర్పంచ్ భర్త అంజనేయులును అధికారులు అరెస్టు చేశారు. వారిని హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుపై ప్రస్తుతం తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >