| Daily భారత్
Logo




సోషల్ మీడియాలో వ్యూస్, లైకుల కోసం ఆత్మహత్య డ్రామా..

News

Posted on 2026-05-12 19:01:13

Share: Share


సోషల్ మీడియాలో వ్యూస్, లైకుల కోసం ఆత్మహత్య డ్రామా..

యువకుడిపై కామారెడ్డి పోలీసులు కేసు నమోదు

మీ "లైకుల" సరదా.. పోలీసుల "సమయం" వృథా: ఆత్మహత్య డ్రామా వీడియోలు తీసి ఆపదలో ఉన్నవారి ప్రాణాలతో ఆడుకోకండి!

సోషల్ మీడియా మోజు వద్దు – కష్టపడి చదివి బంగారు భవిష్యత్తుకు పునాది వేయండి

జిల్లా ఎస్పి యం. రాజేష్ చంద్ర ఐపిఎస్  

డైలీ భారత్, కామారెడ్డి:సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యూస్ మరియు లైక్స్ కోసం “ఆత్మహత్య చేసుకుంటున్నాను” అన్నట్లుగా వీడియో రూపొందించి పోస్ట్ చేసిన యువకుడిపై కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాలలోకి వెళ్తే,.. 

రెడ్లాన్ రోహిత్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు భావోద్వేగ వీడియో రూపొందించి పోస్ట్ చేయడంతో, విషయం గమనించిన కామారెడ్డి పట్టణ పోలీసులు వెంటనే అప్రమత్తమై అతని ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా, తాను కేవలం సోషల్ మీడియాలో వ్యూస్ మరియు లైక్స్ సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఆ వీడియో రూపొందించినట్లు రోహిత్ తెలుపడం జరిగింది.

ఈ ఘటన కారణంగా పోలీసులు అత్యవసర పరిస్థితిగా భావించి వెంటనే స్పందించాల్సి రావడం వల్ల విలువైన పోలీసు సమయం మరియు వనరులు వృథా అయినట్లు కామారెడ్డి ఇన్స్పెక్టర్ నరహరి తెలిపారు. ఈ నేపథ్యంలో సంబంధిత చట్టాల ప్రకారం అతనిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పి  మాట్లాడుతూ, 

సోషల్ మీడియాలో కొన్ని లైకులు, వ్యూస్ కోసం ప్రాణాలతో చెలగాటం ఆడుతూ "ఆత్మహత్య డ్రామాలు" చేయడం అత్యంత బాధ్యతారాహిత్యం. మీ ఒక్క తప్పుడు పోస్ట్ వల్ల పోలీస్ యంత్రాంగం మొత్తం అత్యవసర పరిస్థితిగా భావించి పరుగులు తీయాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి.. పోలీసుల విలువైన సమయం మరొకరి ప్రాణాన్ని కాపాడటానికో లేదా ఆపదలో ఉన్న బాధితులకు సాయం చేయడానికో ఉపయోగపడాలి. ఇలాంటి నిర్లక్ష్యపూరిత చర్యల వల్ల పోలీసుల సమయం వృథా అయితే, నిజంగా ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తికి సాయం అందడంలో ఆలస్యం జరగొచ్చు.

 యువత రీల్స్, సోషల్ మీడియా మోజులో పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, కష్టపడి చదువుకుని జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలని ఎస్పీ  సూచించారు. తల్లిదండ్రుల ఆశలను నిలబెట్టేలా ముందుకు సాగాలని, క్షణికమైన గుర్తింపు కోసం తప్పుదారులు పట్టవద్దని హెచ్చరించారు. ప్రజల భద్రత కోసం పనిచేసే పోలీసుల సమయాన్ని వృథా చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పి స్పష్టం చేశారు.

Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >
Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >