| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల జిల్లా :1.4 కేజీల శిశువుకు పునర్జన్మ...

News

Posted on 2026-05-12 19:10:28

Share: Share


రాజన్న సిరిసిల్ల జిల్లా :1.4 కేజీల శిశువుకు పునర్జన్మ...

పద్మావతి ఆసుపత్రి వైద్యుల ఘనత...

14 రోజుల పోరాటం తర్వాత క్షేమంగా డిశ్చార్జ్...

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: నెలలు నిండకముందే అత్యంత తక్కువ బరువుతో జన్మించిన ఓ పసికందును వేములవాడలోని పద్మావతి తల్లి, పిల్లల ఆసుపత్రి వైద్యులు ప్రాణాపాయం నుంచి తప్పించారు. నల్గొండ జిల్లాకు చెందిన లింగంపల్లి పుష్పలత–భరత్ దంపతులు గర్భధారణ సమయంలో పద్మావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.అయితే ఎనిమిదో నెల పూర్తికాకముందే పుష్పలతకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. గైనకాలజిస్ట్ డాక్టర్ తేజస్విని పర్యవేక్షణలో ఆమెకు సాధారణ ప్రసవం జరగ్గా కేవలం 1.4 కేజీల బరువుతో మగ శిశువు జన్మించాడు. శిశువు ఆరోగ్య పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉండటంతో చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో వెంటనే ఎన్‌ఐసీయూ విభాగంలో చేర్చి చికిత్స ప్రారంభించారు. ఊపిరితిత్తుల సమస్య జాండిస్, సెప్సిస్ వంటి తీవ్రమైన ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్న శిశువుకు నాలుగు రోజుల పాటు నాన్-ఇన్వేసివ్ వెంటిలేషన్ ద్వారా శ్వాస అందిస్తూ ప్రత్యేక వైద్యం అందించారు. వైద్యుల నిరంతర కృషి, పర్యవేక్షణతో 14 రోజుల తర్వాత బాబు పూర్తి ఆరోగ్యవంతుడు కావడంతో మంగళవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ ప్రీమెచ్యూర్ శిశువులకు సర్ఫాక్టెంట్, సీపాప్ వంటి అత్యాధునిక సౌకర్యాలతో మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. డాక్టర్ తేజస్విని మాట్లాడుతూ సామాన్యులకు అందుబాటులో ఉండేలా తక్కువ ఖర్చుతోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. వేములవాడ పరిసర ప్రాంతాల్లోనే అత్యాధునిక ఎన్‌ఐసీయూ సౌకర్యం ఉండటం వల్ల అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడగలుగుతున్నామని ఆసుపత్రి నిర్వాహకులు రాజేష్ తెలిపారు. తమ బిడ్డకు పునర్జన్మ ప్రసాదించిన వైద్యులకు, ఆసుపత్రి సిబ్బందికి బాబు తండ్రి భరత్ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >
Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >