| Daily భారత్
Logo




షాద్‌నగర్‌లో దారుణ హత్య కేసు ఛేదన

News

Posted on 2026-05-12 19:30:43

Share: Share


షాద్‌నగర్‌లో దారుణ హత్య కేసు ఛేదన

డబ్బుల కోసం కూలీ కార్మికుడిని హత్య చేసిన ఇద్దరు నిందితులు అరెస్ట్

టెక్నికల్ ఆధారాలతో 48 గంటల్లో కేసు ఛేదించి ప్రెస్ మీట్ లో వెల్లడించిన షాద్‌నగర్ పోలీసులు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. డబ్బుల కోసం కూలీ కార్మికుడిని హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం, మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట్ మండలం పోమాల్ గ్రామానికి చెందిన పల్లె కేశవులు (39) షాబాద్ మండలం సర్దార్‌నగర్‌లోని శ్రీనివాసరావు ఫామ్ హౌస్‌లో కూలీగా పని చేస్తూ కుటుంబంతో నివసిస్తున్నాడు. భూమి వివాదం విషయంలో మాట్లాడేందుకు మే 9న తన యజమాని వద్ద నుంచి రూ.50 వేల అప్పుగా తీసుకుని పరిగికి వెళ్లాడు. అక్కడ తన అన్నదమ్ములతో కలిసి భూమి సమస్యపై చర్చించి, తిరిగి షాద్‌నగర్‌కు చేరుకున్నాడు.

ఆ రాత్రి షాద్‌నగర్ బస్టాండ్ సమీపంలోని వైన్ షాప్ వద్ద మద్యం సేవిస్తున్న సమయంలో పుల్లగోయి బజరన్నతో పరిచయం ఏర్పడింది. ఈ సమయంలో కేశవుల వద్ద నగదు ఉన్న విషయం గమనించిన బజరన్న డబ్బులు దోచుకోవాలని యోచించాడు. అనంతరం బైన్ల యాదమ్మ సహకారంతో కేశవులను వీర్లపల్లి రోడ్డులోని SRR వెంచర్ ప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేశాడు. ఘటనలో కేశవులు అక్కడికక్కడే మృతి చెందగా, నిందితులు నగదు తీసుకుని పరారయ్యారు.

ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన షాద్‌నగర్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టి మే 12న నిందితులు పుల్లగోయి బజరన్న, బైన్ల యాదమ్మలను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

నిందితుల వద్ద నుంచి రూ.3,900 నగదు, హోండా షైన్ బైక్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు.

ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి, షాద్‌నగర్ డీసీపీ సీహెచ్ శిరీష, ఏసీపీ ఎస్ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె. సీతారాం నేతృత్వంలో ప్రత్యేక బృందం ఈ కేసును ఛేదించింది. కేసు ఛేదనలో పాల్గొన్న పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >
Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >