| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో సంచలన తీర్పు....

News

Posted on 2026-05-18 14:12:14

Share: Share


రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో సంచలన తీర్పు....

పది మంది నిందుతులకు యావజ్జీవకారాగార(జీవిత ఖైదు) శిక్ష

నేరం చేస్తే శిక్షలు తప్పవు,శిక్షలతోనే సమాజంలో మార్పు.

జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.

డైలీ భారత్, బోయినపల్లి: బోయినపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన హత్య కేసులో పది(10) మంది నిందుతులకు యావజ్జీవకారాగార (జీవితఖైదు) శిక్ష,ఒక్కొక్కరికి 6500/- రూపాయల జరిమాన విధించినట్లు సోమవారం రోజున సిరిసిల్ల జిల్లా ప్రధాననాయమూర్తి నీరజ గారు కీలక తీర్పు వెల్లడించినట్లు  జిల్లా ఎస్పీ తెలిపారు.

నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ అధికారులను, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను, కోర్టు కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అభినందించారు.

బోయినపల్లి మండలం స్థంబంపల్లి గ్రామానికి చెందిన తునికి లక్ష్మీనారాయణకి ఇద్దరు కుమారులు చిన్న కుమారుడు అయినటువంటి మహేష్ అదే గ్రామానికి చెందిన బొంగానీ పరిశరాములు యొక్క కూతురు ఒకరికొకరు ప్రేమించుకున్నారు.ఇట్టి విషయం నచ్చని అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు బంధువులు( పది మంది) కలిసి అబ్బాయి వల్ల ఇంటి మీదకి గొడవకి పోయి అబ్బాయి కుటుంబ సభ్యులను కట్టెలతో రాడ్ లతో మరియు చేతులతో కొట్టగా అబ్బాయి తండ్రి అయినటువంటి తునికి లక్ష్మీనారాయణకి బాగా గాయాలు అయ్యి చనిపోయాడు.ఇట్టి కేసులో మృతిని భార్య అయిన తునికి విజయ పిర్యాదు మేరకు బోయినపల్లి పోలీసులు కేసు నమోదు చేసి పది మంది నిందుతులను రిమాండ్ కి తరలించారు.

అప్పటి వేములవాడ రూరల్ సీఐ నవీన్ కుమార్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయగా,ఈకేసు విచారణ దశలో అదనపు ఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్,కోర్టు మానిటరింగ్ ఎస్సై రవీంద్ర నాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ సరేష్ కుమార్ , రాజేంద్ర ప్రసాద్ , కోర్టు మానిటరింగ్ కానిస్టేబుల్ నవీన్ లు కోర్టులో 20 మంది సాక్షులను ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్ తరపున  గత పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్ వాదించారు.శాస్త్రీయ ఆధారాలు మరియు సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో 10 మంది నిందుతులకు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి  6500/- రూపాయల జరిమానా విధించడం జరిగింది.

సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకోలేరని, శిక్షల ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని జిల్లా ఎస్పీ తెలిపారు. పోలీసులు మరియు ప్రాసిక్యూషన్ సమన్వయంతో వ్యూహాత్మకంగా న్యాయ విచారణ, న్యాయ నిరూపణ నిర్వహించి నిందితులకు తప్పనిసరిగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు.

పై కేసుల్లో నిందితులకు శిక్ష పడటంలో కృషి చేసిన అదనపు ఎస్పీ చంద్రయ్య, పీపీలు పెంట శ్రీనివాస్, అప్పటి ,ప్రస్తుత సి.ఐ లు నవీన్ కుమార్, శ్రీనివాస్, సిఎంఎస్ ఎస్‌ఐ రవీందర్ నాయుడు, బోయినపల్లి ఎస్ ఐ రమాకాంత్,కోర్ట్ మానిటరింగ్ కానిస్టేబుల్ నవీన్‌,కోర్టు కానిస్టేబుల్ సరేష్ , రాజేంద్ర ప్రసాద్ లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >
Image 1

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

Posted On 2026-08-08 16:04:38

Readmore >
Image 1

రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్

Posted On 2026-08-08 14:28:17

Readmore >