Posted on 2026-05-18 15:57:39
డైలీ భారత్, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె.రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డు నందు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 8 మంది ద్విచక్ర వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు గుర్తించి కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని సోమవారం 18.05.2026న సెకండ్ క్లాస్ కోర్టు న్యాయమూర్తి శ్రీ ఆర్. శశిధర్ గారి ఎదుట హాజరుపర్చగా, అందులో 7 మందికి ఒక్కొక్కరికి రూ.1000/- జరిమానా విధించబడింది.
అలాగే ఒక ద్విచక్ర వాహనదారునికి 3 రోజుల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
#MahabubnagarPolice
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >