| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్లలో రాజకీయ సెగ...

News

Posted on 2026-05-18 15:51:54

Share: Share


రాజన్న సిరిసిల్లలో రాజకీయ సెగ...

బీఆర్ఎస్ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత..

బండి సంజయ్, బండి భగీరథ్ ఫోటోతో కూడిన భారీ ప్లెక్సీ తో నిరసన..

డైలీ భారత్, సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో మరోసారి రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక బీఆర్ఎస్ భవన్ వద్ద భారీ ఫ్లెక్సీతో కాకరేపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఆయన కుమారుడు భగీరథ్‌లకు సంబంధించిన ఒక భారీ ఫ్లెక్సీని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై ఉంచి బైఠాయించారు. బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా రోడ్డుపై ఉన్న ఫ్లెక్సీని తొలగించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులను అడ్డుకొని వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.పోలీసులు నిరసనకారులను చెల్లాచెదురు చేశారు. ఆందోళనలో పాల్గొన్న పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలను, కార్యకర్తలన వాహనాల్లోకి ఎక్కించి, అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ, ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ స్థానికంగా నెలకొంది.

Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >
Image 1

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

Posted On 2026-08-08 16:04:38

Readmore >
Image 1

రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్

Posted On 2026-08-08 14:28:17

Readmore >