Posted on 2026-05-19 10:46:32
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాత కొత్తగూడెంలోని నూతన వెన్నెల నగర్ కాలనీలో సుమారు 270 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. అక్కడ బేస్మెంట్ గోడలు స్లాబ్ లెవల్లో కట్టిన వారికి కొంతమందికి మొదటి బిల్లు కూడా పడలేదని సేవ్ కొత్తగూడెం సేవ్ కార్పొరేషన్ కన్వీనర్, ఆవాజ్ పట్టణ కార్యదర్శి జలాల్ అన్నారు. నేడు జరిగిన ఇందిరమ్మ నిర్మాణ లబ్ధిదారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బిల్లులు పెండింగ్ ఉండడం వల్ల ఇండ్ల నిర్మాణాలు ఆగిపోతున్నాయని అలానే కొనసాగితే ఇండ్లు మొండి గోడలు గా మిగిలిపోయే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఇందిరమ్మ బిల్లులు ఎప్పటికప్పుడు విడుదల అయ్యేలా చూడాలని ఆయన కోరారు.
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >