Posted on 2026-05-25 15:10:05
కామారెడ్డి పట్టణ ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటా టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ చంద్రశేఖర్ రెడ్డి
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ,కామారెడ్డి మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వేంకట రమణా రెడ్డి సమావేశం నిర్వహించారు ఆ సమావేశం వెనుక అంతర్యం ఏమిటి.
ఎమ్మెల్యేగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేసి రివ్యూ మీటింగ్ పెడితే బాగుంటుండే.
మున్సిపాలిటీ పరిధిలో ఒక ఆరు ఎకరాల ఒక వెంచర్ కు ఛార్జీ తీసుకున్న 3 రోజులకే కమిషనర్ అనుమతులు ఇచ్చారు. అంత తొందరగా ఇవ్వాల్సిన అవసరం ఏముంది.
నిజామాబాద్ వ్యక్తులకు చెందిన వ్యక్తుల వెంచర్ కు వుటావుటిన అనుమతులు ఇప్పించి వారితో స్వలాభం పొంది ప్రభుత్వ స్కూళ్లకు బెంచీలు పంపిణీ చేశారు.
గత వర్షాకాలంలో భారీ వర్షాలకు కూల్చిన రోడ్డు డివైడర్ లను తిరిగి నిర్మించే పనులు ఎమ్మెల్యే చేయడం లేదు.
హిందూ స్మశానవాటిక నిర్మాణానికి అన్ని సంఘాల వారితో మాట్లాడి అభివృద్ధికి నేను కృషి చేస్తుంటే కొంత మంది ఈ మంచి పనికి కొందరు కలిసి రావడం లేదు.
ఎవరైతే హిందువుల ఓట్లతో గెలిచినారో వారే ఈ హిందూ శ్మశాన వాటిక నిర్మాణానికి కలిసి నడవడం లేదు.
కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రభుత్వ సలహాదారుగా, ఎమ్మెల్యేగా ఉన్నవారు హిందూ శ్మశాన వాటికలో అభివృద్ధికి అడ్డుపడుతున్నారు.
పది రోజుల్లో జిల్లా కలెక్టర్ ను కలిసి శ్మశాన వాటిక అభివృద్ధికి అనుమతి ఇవ్వాలని కోరబోతున్న అందుకు మిగతా నాయకులు కలిసి రావాలి, లేదంటే అన్ని కుల సంఘాల నాయకులతో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం.
పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో అక్రమ కట్టడాలను అడ్డుకునే స్థితిలో కామారెడ్డి అధికారులు, ప్రజా ప్రతినిధులు లేరు.
వారం రోజుల్లో పట్టణంలో కట్టిన అక్రమ కట్టడాలను కూల్చకపోతే ఆ కట్టడాల వద్దనే మీడియా సమావేశం పెట్టాల్సి వస్తది.
ఎన్నికల సమయంలో తప్ప గ్రామాలవైపు ఎమ్మెల్యే వెళ్లిన దాఖలాలు లేవు.
ఈ కార్యక్రమంలో, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పిడుగు మమత సాయిబాబు, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు మున్సిపల్ కౌన్సిలర్, గడ్డమీది మహేష్, తాటి ప్రసాద్ లావణ్య, క్రెడా అధ్యక్షులు నర్సాగౌడ్,మాజీ కౌన్సిలర్లు, సలీం,చాట్ల వంశీ, రంగ రమేష్ గౌడ్, కామారెడ్డి సేవాదళ్ యూత్ అధ్యక్షులు, నర్సుల మహేష్, బల్ల శ్రీనివాస్, మెహర్ బాబా గౌడ్, అరుణ్, రాహుల్, శశి, ఆకాష్. ఉన్నారు
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >