| Daily భారత్
Logo




అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

News

Posted on 2026-05-25 17:15:49

Share: Share


అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

300 దరఖాస్తుల రాక

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల :  ప్రజావాణి అర్జీలు సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా సిరిసిల్ల సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. 

మొత్తం దరఖాస్తులు 300 వచ్చాయి.

సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం తోపాటు సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవో కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలలోనూ ప్రజావాణి కొనసాగుతుందని, స్థానిక ప్రజలు తమ అర్జీలు అందించాలని సూచించారు. సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ రాజేందర్ రెడ్డి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 9 దరఖాస్తులు రాగా, సంబంధిత శాఖల అధికారులకు అందించి పరిష్కరించాలని ఆదేశించారు. వేములవాడ ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ కేఎస్బీ కుమారి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 12 దరఖాస్తులు రాగా, సంబంధిత శాఖల అధికారులకు అందించి పరిష్కరించాలని ఆదేశించారు. ఐడీఓసీ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, హౌసింగ్ పీడీ వెంకట మాధవ రావు తదితరులు పాల్గొన్నారు.

Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >