| Daily భారత్
Logo




కొత్తగూడెం అభివృద్ధిపై సీఎం వద్ద కూనంనేని గళం

News

Posted on 2026-05-25 21:25:57

Share: Share


కొత్తగూడెం అభివృద్ధిపై సీఎం వద్ద కూనంనేని గళం

కేటీపీఎస్ కొత్త ప్లాంట్లు

గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్

ఆసుపత్రి అప్‌గ్రేడ్

జర్నలిస్టులకు ఇళ్లు డిమాండ్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. సోమవారం హైదరాబాద్ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూనంనేని సాంబశివరావు నేతృత్వంలోని సిపిఐ రాష్ట్ర ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసి పలు అభివృద్ధి, ప్రజా సమస్యలపై వినతిపత్రం అందజేసింది.

ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ కేటీపీఎస్ పాత ఎ, బి, సి స్టేషన్ల స్థానంలో కొత్తగా 2/800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని కోరినట్లు తెలిపారు. అలాగే కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలకు ఆధునిక సౌకర్యాలతో కూడిన కొత్త ఆర్టీసీ బస్ స్టాండ్ భవనాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.

కొత్తగూడెం మున్సిపాలిటీని “కొత్తగూడెం–పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్”గా అప్‌గ్రేడ్ చేయాలని, కిన్నెరసాని ప్రాజెక్ట్ పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల చేయాలని కోరారు. హరిత రిసార్ట్, బడ్జెట్ హోటల్ పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు తక్షణ నిధులు కేటాయించాలని సీఎంకు వివరించారు.

ముర్రేడు వాగు రక్షణ గోడ నిర్మాణానికి రూ.50.50 కోట్లు మంజూరు చేయాలని, సింగభూపాలెం, చింతల చెరువుల ఆధునీకరణకు నిధులు విడుదల చేయాలని కోరారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పంపిణీ కాలువల డిజైన్ మార్పు, పొడిగింపు పనులను వేగవంతం చేయాలని సూచించారు.

విద్యా, క్రీడా రంగ అభివృద్ధిలో భాగంగా 20 ఎకరాల్లో సమగ్ర క్రీడా స్టేడియం ఏర్పాటు చేయాలని, మహిళల రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ పనులకు రూ.1160 లక్షలు, గిరిజన మహిళా డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరు చేయాలని కోరారు. పాలిటెక్నిక్ కళాశాల పునర్నిర్మాణానికి రూ.25 కోట్లు, సుజాతనగర్ జూనియర్ కళాశాల, కొత్త ఐటీఐలలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

వైద్య సేవల విస్తరణలో భాగంగా పాల్వంచ సీహెచ్‌సీని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని, కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో కాత్‌ల్యాబ్, ఎంఆర్ఐ స్కానింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా పట్టణంలో ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని తెలిపారు.

జీవో నెంబర్ 76 కింద ఇళ్ల క్రమబద్ధీకరణ, పెండింగ్ పోడు భూముల పట్టాల సమస్యలను పరిష్కరించాలని, ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కొత్తగూడెంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయ స్థలం గుర్తించాలని, పాస్‌పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

మైలారం రాగి గని పునఃప్రారంభం, పాండురంగాపురం–భద్రాచలం రైల్వే లైన్ సాధన, డీఎంఎఫ్‌టీ నిధుల విడుదల అత్యవసరమని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ రోడ్లు, వంతెనల నిర్మాణంతో పాటు ఎంఆర్ఓ, జెడ్పీ, ఎంపీడీఓ శాశ్వత కార్యాలయ భవనాలకు నిధులు కేటాయించాలని కోరారు.

చివరగా కొత్తగూడెం, పాల్వంచ ప్రాంత జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు కూనంనేని తెలిపారు. తాము సమర్పించిన వినతిపత్రంలోని అంశాలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన పేర్కొన్నారు.

Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >