| Daily భారత్
Logo




కామారెడ్డి జిల్లాలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పై పోలీసుల ఉక్కుపాదం

News

Posted on 2026-05-26 08:13:24

Share: Share


కామారెడ్డి జిల్లాలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పై పోలీసుల ఉక్కుపాదం

73 మందికి కోర్టు శిక్షలు, 10 మందికి జైలు శిక్షలు & రూ.97,500 జరిమానా.

జిల్లా వ్యాప్తంగా తనిఖీలు - రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం .. మద్యం సేవించి వాహనం నడిపితే జైలుకే..! 

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు కొనసాగుతాయి.   

జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, ఐపిఎస్  

డైలీ భారత్, కామారెడ్డి:  కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడం, ప్రజల ప్రాణాలను రక్షించడం లక్ష్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరంగా నిర్వహిస్తోంది. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టగా, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న మొత్తం 73 మందికి కోర్టు శిక్షలు విధించడం జరిగింది. పట్టుబడిన వారిని పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు వారికి మొత్తం రూ.97,500 జరిమానా విధించింది. అదేవిధంగా కోర్టు నలుగురికి ఒక రోజు జైలు శిక్ష, ఐదుగురుకి రెండు రోజుల జైలు శిక్ష మరియు ఒకరికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్  మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. క్షణిక ఆనందం కోసం చేసే నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెడుతుందని, వాహనదారులు మద్యం సేవించిన తర్వాత వాహనాలు నడపకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించి మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం ఇలాగే కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >