Posted on 2026-05-27 16:31:01
డైలీ భారత్, వేములవాడ: వేములవాడ పట్టణంలో గత తొమ్మిది రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న వేములవాడ అర్బన్, రూరల్ మండలాల ఐకేపీ, వివోఏల ఆందోళనకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వివోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి, వారికి 20 వేల రూపాయల వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే వారికి బీమా సౌకర్యం కల్పించడంతో పాటు, విధుల నిర్వహణకు అవసరమైన ట్యాబ్ మరియు నెట్ సౌకర్యాలను కల్పించాలని కోరారు. అర్హులైన వారికి సీసీలుగా పదోన్నతులు కల్పించాలని మరియు జీవో 58ను సవరించాలని వివోఏలు చేస్తున్న న్యాయమైన డిమాండ్లకు తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు గోస్కుల రవి, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఏశ తిరుపతి, సర్పంచులు ఊరడి సునీత-రాజిరెడ్డి, ముత్త సంజన-మహేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డం హన్మాండ్లు, మాజీ సర్పంచ్ సుమన్, దేవరాజు, గోపు మధు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >