Posted on 2026-05-27 16:35:33
డైలీ భారత్, గంభీరావుపేట: తుది దశకు చేరుకున్న ధాన్యం కొనుగోళ్ళ ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. బుధవారం గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఇప్పటివరకు ఈ కేంద్రంలో ఎంత ధాన్యం సేకరించారు? ఎంత వరకు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేశారు అనే వివరాలను కొనుగోలు కేంద్రం నిర్వాహకులను కలెక్టర్ ఆరా తీయగా, ధాన్యం కొనుగోలు ప్రక్రియ తుది దశకు చేరుకుందని, తూకం వేసిన బస్తాలను మిల్లుకు వాహనాల ద్వారా తరలిస్తున్నామని కలెక్టర్ కు వివరించారు. తూకం వేసిన బస్తాలను జాప్యం చేయకుండా కొనుగోలు కేంద్రాల నుండి తరలించాలని కలెక్టర్ సూచించారు. ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియపై ఆరా తీశారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ముందుగానే టార్పాలిన్లు సరిపడా అందుబాటులో పెట్టుకోవడం ద్వారా వర్షాలకు ధాన్యం తడవకుండా ఉంటుందని అన్నారు. కొనుగోలు కేంద్రాల నుండి మిల్లుకు తరలించిన అనంతరం మిల్లులో అన్ లోడింగ్ వేగవంతం చేసేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. సన్న రకాల సాగుపై దృష్టి సారించాలని రైతులను కోరారు. ఈ తనిఖీలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కొమిరిశెట్టి విజయ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి లక్ష్మీనారాయణ, జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, వ్యవసాయ అధికారిణి అఫ్జల్ బేగం, తహసీల్దార్ మారుతి రెడ్డి, ఎంపీడీఓ రాజేందర్, తదితరులు ఉన్నారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >