| Daily భారత్
Logo




దేశ సరిహద్దులకు 15 కి.మీ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చేయాలి : అమిత్‌ షా

News

Posted on 2026-05-27 18:46:07

Share: Share


దేశ సరిహద్దులకు 15 కి.మీ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చేయాలి : అమిత్‌ షా

డైలీ భారత్, న్యూఢిల్లీ: దేశ సరిహద్దులకు 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చివేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అధికారులను ఆదేశించారు. ఈ అంశంలో రాజీలేని విధానాన్ని అమలు చేయాలన్నారు. రాజస్థాన్‌లోని భారత్-పాక్‌ సరిహద్దు జిల్లాల్లో భద్రతా పరిస్థితులపై అమిత్‌ షా ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి రాజస్థాన్‌ సీఎం భజన్‌లాల్ శర్మతో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. సరిహద్దు ప్రాంతాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆయా జిల్లా కలెక్టర్లకు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. సరిహద్దు ప్రాంతాల్లోని అన్ని బ్యాంకింగ్ లావాదేవీల్లో చట్టపరమైన, ఆర్థికపరమైన నిబంధనల అమలును పర్యవేక్షించాలని పేర్కొంది. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలను తనిఖీ చేసి, వాటికి అందుతున్న నిధుల మూలాలను పరిశీలించాలని తెలిపింది. మ్యూల్ అకౌంట్లు, నకిలీ కంపెనీ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేస్తూ ఉండాలని సూచించింది. నకిలీ ఆధార్ కార్డులను గుర్తించడంతో పాటు సరిహద్దుల గుండా జరిగే స్మగ్లింగ్‌ను పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్లను హోంశాఖ ఆదేశించింది. సరిహద్దు జిల్లాల్లో జరుగుతున్న నేరాలు, డ్రగ్స్ మహమ్మారి వెనుక ఉన్న నెట్‌వర్క్‌లపై లోతైన అధ్యయనం చేయాలని సూచించింది. ఈ సమస్యలు మళ్లీ తలెత్తకుండా శాశ్వత పరిష్కారాలను అన్వేషించాలని స్పష్టం చేసింది. సరిహద్దు జిల్లాల జనాభాకు మద్దతుగా నిలవడానికి, మౌలిక సదుపాయాల కొరతను తీర్చడానికి వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది.

Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >