| Daily భారత్
Logo




35 మంది హోం గార్డులకు కౌన్సిలింగ్ ద్వారా పారదర్శక బదిలీలు నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

News

Posted on 2026-05-28 10:04:11

Share: Share


35 మంది హోం గార్డులకు కౌన్సిలింగ్ ద్వారా పారదర్శక బదిలీలు నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో తేది 27-06-2026 నాడు జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆధ్వర్యంలో 35 మంది హోం గార్డులకు కౌన్సిలింగ్ పద్ధతిలో బదిలీ ప్రక్రియ నిర్వహించబడింది. ఇందులో నిజామాబాద్ జిల్లా నుండి బదిలీపై వచ్చిన 32 మంది హోం గార్డ్స్‌ తో పాటు జిల్లాలో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న 3 మంది హోం గార్డ్స్‌కు బదిలీలు చేపట్టారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రతి హోం గార్డుతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి విల్లింగ్, సీనియారిటీ, స్పౌస్ ప్రాధాన్యత, ఆరోగ్య పరిస్థితులు, రికార్డులను పరిగణలోకి తీసుకొని పూర్తిగా పారదర్శకంగా కౌన్సిలింగ్ విధానంలో బదిలీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ, హోం గార్డ్స్ అందరూ క్రమశిక్షణతో తమకు కేటాయించిన పోలీస్ స్టేషన్లలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. విధుల్లో నిబద్ధత, నిజాయితీ, ప్రజల పట్ల మర్యాదతో వ్యవహరించడం ఎంతో ముఖ్యమని తెలిపారు.

పోలీస్ శాఖలో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఉందని, ఒక్కరి నిర్లక్ష్యం మొత్తం శాఖ ప్రతిష్టపై ప్రభావం చూపుతుందని గుర్తు చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ తమ పనితీరును మెరుగుపరుచుకొని, తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కె. నరసింహారెడ్డి, ఆర్‌ఐలు సంతోష్, నవీన్ కుమార్, కృష్ణ , ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >