Posted on 2026-05-28 10:05:32
బిక్నూర్ టోల్‌ప్లాజా చెక్‌పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
• పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా - చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు!
• శాంతిభద్రతల పరిరక్షణే ప్రథమ ప్రాధాన్యం
జిల్లా ఎస్పి యం రాజేష్ చంద్ర ఐపిఎస్
డైలీ భారత్, కామారెడ్డి: బక్రీద్ పండుగను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతలను కట్టుదిట్టం చేయడంలో భాగంగా బిక్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టోల్‌ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్‌పోస్ట్‌ను కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్‌పోస్ట్ వద్ద చేపడుతున్న వాహనాల తనిఖీ విధానం, రికార్డుల నిర్వహణ మరియు విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది పనితీరును ఎస్పీ స్వయంగా పరిశీలించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు, సంబంధిత అనుమతి పత్రాలు, రవాణా ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని అక్కడి అధికారులను ఆదేశించారు.
తనిఖీ చేసిన వాహనాల వివరాలను రిజిస్టర్లలో ఎప్పటికప్పుడు స్పష్టంగా నమోదు చేస్తూ పారదర్శకత పాటించాలని ఎస్పీ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు మరియు వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అక్రమ రవాణా లేదా ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో విధులు నిర్వహించే సిబ్బంది తమ రక్షణ కొరకు ట్రాఫిక్ బ్యాటన్స్, రిఫ్లెక్టివ్ జాకెట్లు తప్పనిసరిగా ధరించాలని, ఎలాంటి అనుమానాస్పద కదలికలు గమనించినా వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు.
పండుగ ముందస్తు చర్యల్లో భాగంగా పోలీస్, రెవెన్యూ మరియు పశుసంవర్ధక శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేస్తూ పశువుల రవాణాపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఎస్పీ సూచించారు.
అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ అన్ని అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టిందని తెలిపారు. పశువుల అక్రమ రవాణా, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లా ప్రజలందరూ చట్టాన్ని గౌరవిస్తూ ప్రశాంత వాతావరణానికి పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. ఈ ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, బిక్నూర్ సీఐ నరేష్, ఎస్సై ప్రభాకర్ మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >