Posted on 2026-05-28 18:18:15
దెబ్బతిన్న నరాలకు ఆధునిక శస్త్ర చికిత్సలు
మెడ, భుజాల గాయాలపై యశోద హాస్పిటల్స్ అవగాహన సదస్సు
డైలీ భారత్, కామారెడ్డి: హైదరాబాద్ హైటెక్ సిటీలోని Yashoda Hospitals ఆధ్వర్యంలో కామారెడ్డి యశోద సెంటర్‌లో మెడ, భుజాల గాయాలు మరియు బ్రేక్యాల్ ప్లెక్సస్ ఇంజరీ కారణంగా ఏర్పడే చేతి నరాల సమస్యలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్య నిపుణులు డాక్టర్ పి. ప్రకాష్ మాట్లాడుతూ ప్రమాదాల వల్ల దెబ్బతిన్న నరాలకు ఆధునిక వైద్య సాంకేతికతతో శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. చేతులకు సరఫరా చేసే నరాలు దెబ్బతింటే చేతుల కదలికలు తగ్గిపోవడం, భుజం బలహీనత, నరాల పనితీరు దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురవుతాయని వివరించారు.
బాధితులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరాన్ని బట్టి శస్త్రచికిత్సలు, ఫిజియోథెరపీ ద్వారా సమగ్ర చికిత్స అందించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లలు మరియు రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఈ చికిత్సలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వైద్యులు పేర్కొన్నారు.
సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించి నిపుణులను సంప్రదిస్తే చేతుల పనితీరును మెరుగుపరచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు సూచించారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >