Posted on 2026-05-31 13:53:49
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: బాసర ట్రిపుల్ ఐటీకి సిరిసిల్ల అర్బన్ చంద్రంపేట హైస్కూల్ విద్యార్థులు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయురాలు కైరి పద్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం వెలువడిన ఫలితాల్లో చంద్రంపేట ఉన్నత పాఠశాలకు చెందిన ఒగ్గు అక్షయ,ఒగ్గు అఖిల, నర్మెట్ట మనస్విని ఉత్తమ మార్కులు రావడంతో వారిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో ఒగ్గు అక్షయ 569, ఒగ్గు అఖిల 566, నర్మెట్ట మనస్విని 559 మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు తెలిపారు. ఇందులో ఒగ్గు అక్షయ, ఒగ్గు అఖిల కవలలు కావడం విశేషం. చంద్రంపేట గ్రామం నుండి ముగ్గురు విద్యార్థులు ట్రిపుల్ ఐటీకి ఎంపిక కావడం పట్ల పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ కంది సుజాత, ఉపాధ్యాయ బృందం కొండికొప్పుల రవి, ముంజ రమ, వేముల అంజలి, వి.మధుసూధన్, పి.అనిల్ కుమార్, యం.చక్రపాణి, మిరియం, లత, త్రివేణి, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తుల హర్షం వ్యక్తం చేశారు
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >