Posted on 2026-06-02 11:54:03
అమరవీరుల పోరాటం, ఆత్మత్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది
జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు – జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
డైలీ భారత్, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని (02-06-2026) కామారెడ్డి జిల్లా క్యాంపు కార్యాలయం మరియు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం అవతరించి 12 వసంతాలు పూర్తి చేసుకొని, నవశకానికి నాంది పలుకుతూ 13వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందరో అమరులు చేసిన ఆత్మబలిదానాలు, మహనీయుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వారి ఆశయ సాధనలో భాగంగా రాష్ట్ర అభివృద్ధికి ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. తెలంగాణ బిడ్డలుగా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
జిల్లా పోలీసు శాఖ తరపున కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాల ద్వారా వివిధ రకాల ఆన్‌లైన్ మోసాలు, పోక్సో చట్టం కింద నమోదవుతున్న నేరాలు, మహిళలు మరియు చిన్నారుల భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. నరసింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు సంతోష్ కుమార్, నవీన్, ఆర్‌ఎస్‌ఐ శైలూ, ఎస్‌ఐలు మరియు జిల్లా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >