Posted on 2026-06-03 19:59:40
డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని 49 వార్డులలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని వార్డుల వారిగా సమస్యల జాబితా రూపొందించి బీజేపీ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ పర్వతాలు కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లు మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలో అన్ని వార్డులలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయని ముఖ్యంగా శానిటైజేషన్ సమస్య అన్ని వార్డులలో ఉందని, చాలా వార్డుల్లో నూతనంగా CC రోడ్డులు, డ్రైనేజీ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని, రాబోయే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని వరద నీరు ఇబ్బంది లేకుండా చూడాలని, ఇంతే కాకుండా వార్డుల వారిగా సమస్యలు అన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళమని అన్నారు. వాటిని సాధ్యమైనంత తొందర పరిష్కరించి గత వర్షాకాలం ఎదుర్కొన్న సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. పెద్ద డ్రైనేజీలను ముందు చూపుతో మట్టి తీయిస్తే వరద నీరు రోడ్ల పైకి రాకుండా ఉంటుందని తక్షణమే ఆ దిశగా చర్యలు చేపట్టాలని వాటికి బీజేపీ కౌన్సిలర్లము పూర్తి సహకారం అధిస్తామని అన్నారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >