Posted on 2026-06-03 20:05:43
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ శిబిరం జిల్లా కేంద్రంలోని వాసవి కళ్యాణ మండపంలో వైభవంగా ప్రారంభమైంది. జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి అధ్యక్షతన జరిగిన ఈ శిబిరానికి బిజెపి జాతీయ నాయకులు మురళీధర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండు రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి సుమారు 250 మంది ప్రతినిధులు, పదాధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన అనంతరం మురళీధర్ రావు మాట్లాడుతూ, బిజెపి కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదని, అది జాతీయ పునర్నిర్మాణానికి అంకితమైన ఉద్యమమని ఉద్ఘాటించారు. సిద్ధాంతాలు, విలువలు, క్రమశిక్షణే పార్టీకి పునాదని, వాటిని పుణికిపుచ్చుకున్న కార్యకర్తలే ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసాన్ని పెంపొందించగలరని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై అగ్రగామిగా ఎదుగుతోందని, కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తలు చొరవ చూపాలని సూచించారు. జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి శిక్షణా తరగతులు ఎంతో కీలకమని, గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రతి కార్యకర్త సిద్ధాంతాల పట్ల అవగాహన పెంచుకోవాలనే లక్ష్యంతో ఈ శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ రెండు రోజుల పాటు బిజెపి చరిత్ర, వికాసం, సంస్థాగత నిర్మాణం, సోషల్ మీడియా వినియోగం, ఎన్నికల నిర్వహణ వంటి అంశాలపై నిపుణులు, సీనియర్ నాయకులు దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు, మాజీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, జిల్లా ఇన్చార్జి గంగాడి మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు సిరికొండ శ్రీనివాస్, కరెడ్ల మధుకర్, రాష్ట్ర నాయకులు ఎర్ర మహేష్, లింగంపల్లి శంకర్, అల్లాడి రమేష్, కుమ్మరి శంకర్, చంటి మహేష్, ఆడెపు రవీందర్, దశరథం రెడ్డి తదితర ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >