Posted on 2026-06-04 12:50:14
డైలీ భారత్, కామారెడ్డి : తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో ఈ రోజు నుండి ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన "వార్డు సభల"లలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పిలుపునివ్వడం జరిగింది.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ, స్థానిక సమస్యల పరిష్కారానికి, వార్డుల సమగ్ర అభివృద్ధికి వార్డు సభలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.
ఇప్పటికే పట్టణంలో మౌలిక వసతుల కల్పన, తాగునీటి పైప్‌లైన్ల విస్తరణ వంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మున్సిపల్ పాలనను మరింత పారదర్శకంగా, అవినీతి రహితంగా ప్రజలకు చేరువ చేయడమే తమ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.
తడి-పొడి చెత్త వేరు చేయడంపై ప్రత్యేక అవగాహన:
పట్టణాన్ని స్వచ్ఛ కామారెడ్డిగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించాలని చైర్‌పర్సన్ కోరారు.
తడి చెత్త (ఆకుపచ్చ డబ్బా): కూరగాయల వ్యర్థాలు, పాడైపోయిన ఆహార పదార్థాలు, పండ్ల తొక్కలు మొదలైనవి.
పొడి చెత్త (నీలిరంగు డబ్బా): ప్లాస్టిక్ కవర్లు, సీసాలు, పేపర్లు, కార్డ్‌బోర్డులు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు మొదలైనవి.
ఇలా ఇంట్లోనే చెత్తను వేరు చేసి మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు అప్పగించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని, వ్యాధులు ప్రబలకుండా నివారించవచ్చని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వార్డు సభల్లో ఈ అంశంపై ప్రజలకు మరింతగా అవగాహన కల్పిస్తామన్నారు.
వార్డు సభల్లో ప్రజలు తమ పరిధిలోని రోడ్లు, మురుగుకాలువలు, వీధి దీపాలు, పారిశుధ్యం తదితర సమస్యలపై కౌన్సిలర్లు, అధికారులతో చర్చించి అర్జీలు అందజేయవచ్చని తెలిపారు. ప్రజల నుండి వచ్చే సమస్యలను ప్రాధాన్యత క్రమంలో త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
కామారెడ్డి పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని,వార్డు సభలలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, యువత అధిక సంఖ్యలో హాజరై తమ వార్డుల అభివృద్ధికి విలువైన సూచనలు అందించాలని చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ కోరారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ కొత్తపల్లి లలిత చిట్టీబాబు,గ్యార అఖిల, నిట్టు గంగాధర్, సీనియర్ నాయకులు గ్యార సాయిలు, వార్డు ఆఫీసర్స్ ,అధికారులు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు...
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >