| Daily భారత్
Logo




కరీంనగర్ గ్లోబల్ సిటీగా మారే దిశగా అడుగులు వేస్తుంది.. ఇది తెలంగాణకే గర్వకారణం

News

Posted on 2026-06-04 15:58:25

Share: Share


కరీంనగర్ గ్లోబల్ సిటీగా మారే దిశగా అడుగులు వేస్తుంది.. ఇది తెలంగాణకే గర్వకారణం

కరీంనగర్ బహుత్ తేజీ సే ఏక్ గ్లోబల్ సిటీ బన్నే కీ ఓర్ బఢ్ రహా హై....!యే తెలంగాణ కా గౌరవ్ హై.... !!

స్మార్ట్ సిటీ కా మతలబ్ సిర్ఫ్ టెక్నాలజీ నహీం, బల్కి లోగోం కీ జిందగీ కో ఆసాన్ బనానా హై

ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్స్ సమావేశంలో పూర్తి హిందీ ప్రసంగంతో ఆకట్టుకున్న నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ 

డైలీ భారత్, కరీంనగర్: కరీంనగర్ బహుత్ తేజీ సే ఏక్ గ్లోబల్ సిటీ బన్నే కీ ఓర్ బఢ్ రహా హై....యే తెలంగాణ కా గౌరవ్ హై.... (కరీంనగర్ చాలా వేగంగా ఒక గ్లోబల్ సిటీగా మారే దిశగా అడుగులు వేస్తోంది. ఇది తెలంగాణ కే గర్వకారణం.) అని నగర మేయర్ కొలగని శ్రీనివాస్ అన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఋషి కేష్ లో  జరిగిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్స్ 117 వ సమావేశంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పై వ్యాఖ్యలు చేశారు. జూన్ 3 , నాలుగు తేదీల్లో ఋషికేష్  జరిగిన ఆల్ ఇండియా మేయర్స్ సమావేశాల్లో పాల్గొన్న  కోలగాని శ్రీనివాస్ ముందుగా సమావేశంలో పాల్గొన్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి , రాష్ట్ర మంత్రులు , ఎంపీలు , సహచర మేయర్లు , అధికారులందరికీ నమస్కారాలు తెలియజేసి కరీంనగర్ స్మార్ట్ సిటీ , అర్బన్ డెవలప్మెంట్ గురించి హిందీలో  తన ప్రసంగాన్ని కొనసాగించి  అందర్నీ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా  స్మార్ట్ సిటీ కా మతలబ్ సిర్ఫ్ టెక్నాలజీ నహీం, బల్కి లోగోం కీ జిందగీ కో ఆసాన్ బనానా హై....(స్మార్ట్ సిటీ అంటే కేవలం సాంకేతికత మాత్రమే కాదు, ప్రజల జీవితాలను సులభతరం చేయడం.)అని అన్నారు.  కరీంనగర్, తెలంగాణలోని ఒక ముఖ్యమైన ,వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని,  దీనిని కేంద్ర ప్రభుత్వ "స్మార్ట్ సిటీ మిషన్" కింద ఎంపిక చేశారన్నారు. 

కరీంనగర్‌ను ఒక ఆధునిక నగరంగా మార్చడానికి అనేక పెద్ద మార్పులుజరుగుతున్నాయన్నారు నగరంలో స్మార్ట్ రోడ్లు, మంచి ఫుట్‌పాత్‌లు , డ్రైనేజీలు ,  నగరం మొత్తంలో సీసీటీవీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భద్రతను పెంచడానికి అనేక కార్యక్రమాలుజరుగుతున్నాయన్నారు.  ప్రధానంగా  కరీంనగర్‌లో స్వచ్ఛమైన నీరు, మంచి డ్రైనేజీ వ్యవస్థ , మెరుగైన రోడ్లు,  అందమైన పార్కులను నిర్మించి ప్రజలకు ఒక మెరుగైన వాతావరణాన్ని అందించే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు. అంత్ మే ఓర్   ఏక్ బాత్  గర్వ్ సే కహనా చాహాతూ ఇస్ మొకే  పర్... "తెలంగాణ రాజ్య కే గఠన్ కే బాద్ పహలీ బార్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పర్ బిజెపి నే కబ్జా కియా ఔర్ మేయర్ కీ కుర్సీ హాసిల్ కీ. యహ్ తెలంగాణ బిజెపి కే లియే ఏక్ ఐతిహాసిక్ జీత్ జైసీ హై."(చివరగా ఓ విషయాన్ని ఈ సందర్భంగా గర్వముగా చెప్పదలుచుకున్నా.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావనంతరం ప్రప్రదమంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను బిజెపి కైవసం చేసుకుంది..ఇది తెలంగాణలో నే బీజేపీకి ఒక చారిత్రక విజయం లాంటిది.) అని 

ధన్యవాద్!....జైహింద్....భారత్ మాతాకీ జై.... అని మేయర్ కోలగని శ్రీనివాస్ తన ప్రసంగాన్ని ఈ సందర్భంగా ముగించారు. గురువారం ముగింపు సమావేశానికి ఉత్తరాఖండ్ మంత్రి మదన్ కౌశిక్ జి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మదన్ కౌశిక్ జి మేయర్ కొలగని శ్రీనివాస్ ను సన్మానించి, జ్ఞాపికను అందజేశారు.

Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >