| Daily భారత్
Logo




భారీ వర్షాల నేపథ్యంలో రోడ్డుపై పడిన చెట్టును తొలగించి రాకపోకలు పునరుద్ధరించిన బీబీపేట్ పోలీసులు

News

Posted on 2026-06-04 20:12:57

Share: Share


భారీ వర్షాల నేపథ్యంలో రోడ్డుపై పడిన చెట్టును తొలగించి రాకపోకలు పునరుద్ధరించిన బీబీపేట్ పోలీసులు

డైలీ భారత్, కామారెడ్డి : ఈరోజు కురిసిన భారీ వర్షాల కారణంగా బీబీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారాంపల్లి గ్రామ సమీపంలో ఒక భారీ చెట్టు రోడ్డుపై పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

సమాచారం అందుకున్న వెంటనే బీబీపేట్ ఎస్ఐ గారు, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం గ్రామస్థుల సహకారంతో రోడ్డుపై పడిన చెట్టును తొలగించి రహదారిని పూర్తిగా క్లియర్ చేశారు. దీంతో వాహనాల రాకపోకలు తిరిగి సజావుగా పునరుద్ధరించబడ్డాయి.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి అవసరమైన చర్యలు చేపట్టారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించి ప్రజలకు సేవలందించడం పోలీసు శాఖ బాధ్యతగా భావిస్తూ విధులు నిర్వర్తిస్తున్నట్లు అధికారులు తెలిపారు.


ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, IPS వేంటనే స్పందించి రహదారిని క్లియర్ చేసిన బీబీపేట్ పోలీసు సిబ్బందిని అభినందించారు. అలాగే పోలీసులకు సహకరించి చెట్టు తొలగింపు కార్యక్రమంలో పాల్గొన్న సీతారాంపల్లి గ్రామస్థులను ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇలాంటి సందర్భాల్లో ప్రజలు పోలీసులకు సహకరించడం అభినందనీయమని పేర్కొన్నారు.

Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >