| Daily భారత్
Logo




కాకినాడ రూరల్: సీనియర్ అసిస్టెంట్ ఇంటిపై ఏసీబీ దాడులు

News

Posted on 2026-06-05 20:39:30

Share: Share


కాకినాడ రూరల్: సీనియర్ అసిస్టెంట్ ఇంటిపై ఏసీబీ దాడులు

డైలీ భారత్, కాకినాడ: కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న చోడపురెడ్డి శివరామ్ కుమార్ నివాసంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు.

ఉదయం నుంచి సోదాలు చేపట్టిన అధికారులు, ఆయనకు మరియు ఆయన కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ఆస్తులను గుర్తించారు.

ఆయన భార్య పేరుపై కాకినాడలో సుమారు రూ.1,77,62,600 విలువైన ప్లాట్‌తో కూడిన అపార్ట్‌మెంట్, తెలంగాణ రాష్ట్రంలోని కొండాపూర్‌లో రూ.1,34,23,000 విలువైన ప్లాట్, తూర్పుగోదావరి జిల్లా కోటపాడులో 1 ఎకరం 82 సెంట్ల వ్యవసాయ భూమి, అలాగే టయోటా ఫార్చ్యూనర్ కారు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

శివరామ్ కుమార్ పేరుపై కాకినాడ రామారావుపేటలో రూ.1.20 కోట్ల విలువైన 375 గజాల ఖాళీ స్థలం, అలాగే మహీంద్రా కంపెనీకి చెందిన రెండు కార్లు ఉన్నట్లు వెల్లడైంది.

అదనంగా, సోదాల్లో సుమారు 700 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.27,12,800 విలువైన గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.

Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >