Posted on 2026-06-05 21:39:54
9 మందికి జరిమానా, ఇద్దరికి జైలు శిక్ష
డైలీ భారత్, బూర్గంపహాడ్ : బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 11 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు.
పట్టుబడిన 11 మందిని శుక్రవారం భద్రాచలం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో జడ్జి శివ నాయక్ గారు ముందు హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయమూర్తి 9 మందికి జరిమానా విధించగా, ఇద్దరు వ్యక్తులకు ఒక రోజు జైలు శిక్షతో పాటు వంద రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.
ఎస్ఐ మేడా ప్రసాద్ మాట్లాడుతూ ప్రజల భద్రత దృష్ట్యా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. పట్టుబడితే కఠిన చర్యలు తప్పవు" అని హెచ్చరించారు.
మద్యం సేవించి వాహనాలు నడపవద్దు. మీ ప్రాణాలు, ఇతరుల ప్రాణాలు కాపాడండని హితవు పలికారు. ద్వి చక్రవాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే సీజ్ చేస్తామని హెచ్చరించారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >