Posted on 2026-06-12 22:38:10
ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: బాల కార్మికులను పనుల్లో నియమించవద్దని, బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందివ్వాలని లోక్ అదాలత్ సభ్యులు, న్యాయవాది ఆడెపు వేణు అన్నారు.
శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని రాజీవ్ నగర్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షురాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ ఆదేశాలతో సీనియర్ సివిల్ జడ్జి/కార్యదర్శి, డిఎల్ఎస్ఏ పి.లక్ష్మణాచారి సమన్వయంతో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పిల్లల హక్కుల పరిరక్షణ, విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. బాల కార్మిక వ్యవస్థ పిల్లల బాల్యాన్ని, విద్యా అవకాశాలను, శారీరక మానసిక అభివృద్ధిని దెబ్బతీస్తుందని తెలిపారు. ఈ సదస్సులో న్యాయవాదులు సురేష్, రాజు, పారా లీగల్ వాలంటీర్ లావణ్య, న్యాయ సేవ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >