Posted on 2026-06-12 20:23:57
వర్షాకాలానికి ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచన
డైలీ భారత్, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఔట్‌సోర్సింగ్ సానిటేషన్ సిబ్బందితో ఆలయ కార్యనిర్వహణ అధికారి (ఈవో) ఎల్. రమాదేవి సమావేశమై పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా సానిటేషన్ సిబ్బంది అందిస్తున్న సేవలను ప్రత్యేకంగా గుర్తించి అభినందించారు. వేసవి సెలవుల సమయంలో ప్రధాన ఆలయం, అనుబంధ ఆలయాలు, భక్తుల వసతి గృహాలు, పార్కింగ్ ప్రాంగణాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పటికీ సిబ్బంది అంకితభావంతో పనిచేసి పరిశుభ్రతను కాపాడారని ప్రశంసించారు.
రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాన ఆలయం, అనుబంధ ఆలయాలు, వసతి గృహాలు, పార్కింగ్ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షాల కారణంగా ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, దోమలు మరియు క్రిమికీటకాల నివారణకు బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్, సోఫా ఆయిల్, హిట్, ఆల్ అవుట్ తదితర సామగ్రిని అవసరమైన మేరకు వినియోగించాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
సిబ్బంది విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటించాలని, డ్యూటీలకు అనవసరంగా సెలవులు పెట్టకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని తెలిపారు. ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ఐడీ కార్డు ధరించడంతో పాటు నిర్ణీత డ్రెస్ కోడ్‌ను పాటించాలని ఆదేశించారు.
అదేవిధంగా సిబ్బందికి ఏవైనా సమస్యలు, అవసరాలు లేదా ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కరించుకోవాలని సూచించారు. సానిటేషన్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి నెల నాలుగు సెలవులు (ఆఫ్‌లు) మంజూరు చేస్తున్నట్లు ఈవో రమాదేవి గారు ప్రకటించారు.
దేవస్థానానికి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడం ప్రతి ఉద్యోగి బాధ్యత అని ఈవో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీఈవో భాస్కర్ శర్మ, ఏఈఓ అశోక్ కుమార్, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, పూజిత, ఆలయ ఉద్యోగులు మరియు సానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >