| Daily భారత్
Logo




రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

News

Posted on 2026-06-13 11:25:04

Share: Share


రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

సింగభూపాలెం చెరువు మట్టి అక్రమ తరలింపుపై రైతుల ఆగ్రహం

అధికారుల నిర్లక్ష్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న రైతులు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలోని సింగభూపాలెం చెరువు నుంచి రైతుల పంట పొలాలకు తరలించాల్సిన సారవంతమైన తొలకాలు (చెరువు పూడిక మట్టి) ఇతర వ్యాపార అవసరాలకు తరలిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

చెరువు మట్టి వ్యవసాయ భూములకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, పంటల దిగుబడి పెరగడానికి దోహదపడే ఈ మట్టిని రైతులకు అందించాల్సి ఉండగా కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ వెంచర్ల కోసం అక్రమంగా తరలిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

ఈ వ్యవహారాన్ని రైతులు తీవ్రంగా ఖండిస్తూ, సహజ వనరులను వ్యాపార ప్రయోజనాలకు వినియోగించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువు మట్టి తరలింపుపై సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందని, దీని వెనుక అధికారుల లాలూచీ ఉందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.

వెంటనే అధికారులు స్పందించి చెరువు మట్టి తరలింపుపై సమగ్ర విచారణ చేపట్టి, రైతుల ప్రయోజనాలను కాపాడాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >
Image 1

దివ్యాంగుల వైద్యానికి ఆర్థిక సహాయం

Posted On 2026-06-12 21:34:48

Readmore >
Image 1

సానిటేషన్ సిబ్బంది సేవలను గుర్తించి అభినందించిన ఆలయ ఈవో

Posted On 2026-06-12 20:23:57

Readmore >