Posted on 2026-06-12 20:07:23
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం వీరభద్రపురం గ్రామ పరిధిలోని తాళిపేరు ప్రాజెక్టు ఎడమ కాలువను జిల్లా కలెక్టర్ అంకిత్ IAS పరిశీలించి కాలువ పరిస్థితులు, నీటి ప్రవాహం, ఆయకట్టు వివరాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
తాళిపేరు నదిపై చర్ల మండలం పెద్దమిడిసిలేరు వద్ద నిర్మించిన ఈ మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టు ద్వారా సుమారు 24,700 ఎకరాలకు సాగునీరు అందుతుండగా, ఎడమ కాలువ 46.46 కి.మీ పొడవుతో 34 డిస్ట్రిబ్యూటరీల ద్వారా సుమారు 21,100 ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తున్నట్లు అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ IAS మాట్లాడుతూ రైతులకు సాగునీరు అంతరాయం లేకుండా అందేలా కాలువల నిర్వహణను పటిష్టంగా చేపట్టాలని ఆదేశించారు. కాలువల్లో పెరిగిన గడ్డి, చెత్త, మురుగును వెంటనే తొలగించి నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కాలువ వెంబడి దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని, నీటి పంపిణీ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీరు చేరేలా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. కాలువల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని స్పష్టం చేశారు.
ఈ పరిశీలనలో దుమ్ముగూడెం తాసిల్దార్ అశోక్ కుమార్, ఇరిగేషన్ ఈఈ జానీ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >