| Daily భారత్
Logo




నకిలీ బంగారం చూపి దోపిడీ.. ఏడుగురు ముఠా సభ్యుల అరెస్ట్

News

Posted on 2026-06-20 07:55:27

Share: Share


నకిలీ బంగారం చూపి దోపిడీ.. ఏడుగురు ముఠా సభ్యుల అరెస్ట్

2.8 కిలోల నకిలీ బంగారు పూసల దండ, మూడు కత్తులు, టయోటా ఇన్నోవా కారును స్వాధీనం...

బంగారు దండలు దొరికాయంటూ నకిలీ బంగారాన్ని చూపించి అమాయక ప్రజలను మోసం చేసి, కత్తులతో బెదిరించి నగదు దోచుకుంటున్న ముఠా.

డైలీ భారత్, మదనపల్లి: నకిలీ బంగారు పూసల దండను అసలు బంగారంగా చూపించి అమాయక ప్రజలను మోసం చేసి నగదు దోచుకుంటున్న ఏడుగురు సభ్యుల ముఠాను మదనపల్లె టూ టౌన్ పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ పావని వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి సుమారు 2 కిలోల 800 గ్రాముల నకిలీ బంగారు పూసల దండ, మూడు కత్తులు, ఒక టయోటా ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డీఎస్పీ వివరాల ప్రకారం, నిందితులు భూమిలో జేసీబీ పనుల సమయంలో బంగారం దొరికిందని నమ్మబలికి, తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్పి బాధితులను ఆకర్షించేవారు. ఈ క్రమంలో బాధితులను మదనపల్లికి రప్పించి, నకిలీ బంగారు దండను అసలు బంగారంగా చూపించారు. అనంతరం హైవే సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తులతో బెదిరించి నగదు దోచుకున్నట్లు తెలిపారు.

ఈ ఘటనపై మదనపల్లె టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో Cr.No.131/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఉదయం నిర్వహించిన వాహన తనిఖీల్లో టయోటా ఇన్నోవా కారుతో ప్రయాణిస్తున్న ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, నేరాన్ని అంగీకరించినట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 2.8 కిలోల నకిలీ బంగారు పూసల దండ, మూడు కత్తులు, టయోటా ఇన్నోవా కారును స్వాధీనం చేసుకుని, వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ ముఠాపై గతంలో కూడా రెండు కేసులు నమోదైనట్లు విచారణలో తేలిందని, కేసులో మరికొందరి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. నకిలీ బంగారం పేరుతో తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్పి మోసాలకు పాల్పడే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ పావని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా ఇలాంటి మోసాల గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

Image 1

నకిలీ బంగారం చూపి దోపిడీ.. ఏడుగురు ముఠా సభ్యుల అరెస్ట్

Posted On 2026-06-20 07:55:27

Readmore >
Image 1

ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS

Posted On 2026-06-19 21:55:09

Readmore >
Image 1

నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం

Posted On 2026-06-19 20:54:23

Readmore >
Image 1

గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-06-19 20:36:40

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్‌ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌

Posted On 2026-06-19 20:33:12

Readmore >
Image 1

రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

Posted On 2026-06-19 19:17:58

Readmore >
Image 1

భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణ‌మే లక్ష్యం

Posted On 2026-06-19 19:13:38

Readmore >
Image 1

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

Posted On 2026-06-19 19:11:46

Readmore >
Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి

Posted On 2026-06-19 19:00:24

Readmore >
Image 1

దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-06-19 17:52:08

Readmore >