Posted on 2026-06-20 20:28:48
₹4,06,400 జరిమానా, 20 మందికి జైలు శిక్షలు
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడిన 374 మందిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి వివిధ శిక్షలు విధించింది.
ఈ కేసుల్లో మొత్తం ₹4,06,400 జరిమానా విధించబడింది. అదేవిధంగా 15 మందికి ఒక రోజు జైలు శిక్ష, 3 మందికి రెండు రోజుల జైలు శిక్ష, ఒకరికి నాలుగు రోజుల జైలు శిక్ష, మరొకరికి ఐదు రోజుల జైలు శిక్ష విధించబడింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ మాట్లాడుతూ, “మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నాము. మద్యం సేవించిన అనంతరం వాహనాలు నడపకుండా ప్రజలు ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాలను వినియోగించాలి. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత” అని పేర్కొన్నారు.
జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా పోలీసులు హెచ్చరించారు.
నేరెళ్ల పీహెచ్‌సీని సందర్శించిన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ పవిత్ర
Posted On 2026-06-22 18:54:32
Readmore >
మత్తు వదలండి… మైదానాలు చేరండి”: రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి
Posted On 2026-06-22 16:16:28
Readmore >
తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాలను, పార్టీలను, ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి జయశంకర్
Posted On 2026-06-21 20:15:20
Readmore >
పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..!!
Posted On 2026-06-21 19:11:56
Readmore >
బానోత్ భద్రు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-21 17:40:16
Readmore >