Posted on 2026-06-22 20:47:06
డైలీ భారత్, కామారెడ్డి : జిల్లాలో రైతులకు యూరియా ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని, అవసరమైన మేరకు యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎరువుల సరఫరాను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ను అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ యాప్ ద్వారా రైతులు సాగు చేస్తున్న పంటల విస్తీర్ణానికి అనుగుణంగా యూరియా పంపిణీ జరుగుతోందన్నారు. దీనివల్ల ఎరువుల సమాన పంపిణీతో పాటు అక్రమ నిల్వలు, మళ్లింపులను అరికట్టడం సాధ్యమవుతోందని పేర్కొన్నారు.
గత వానాకాలంతో పోలిస్తే ప్రస్తుతం వరి నాట్లు నమోదైన విస్తీర్ణం తక్కువగా ఉన్నప్పటికీ రైతులు ముందస్తుగా యూరియాను కొనుగోలు చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. కామారెడ్డి జిల్లాలో గత ఏడాది ఇదే సమయానికి 5,571 ఎకరాల్లో వరి నాట్లు నమోదుకాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 250 ఎకరాల్లో మాత్రమే నాట్లు నమోదయ్యాయని పేర్కొన్నారు. అయినప్పటికీ గత ఏడాది ఇదే తేదీ నాటికి 2.37 లక్షల యూరియా బస్తాలు కొనుగోలు చేయగా, ఈ ఏడాది 2.64 లక్షల బస్తాలను రైతులు కొనుగోలు చేశారని వివరించారు.
జిల్లాలో ప్రస్తుతం 0.65 లక్షల యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని, అదనంగా అవసరమైన మేరకు నిల్వలను నిరంతరం సమకూరుస్తున్నామని తెలిపారు. అలాగే జిల్లాలో 1.25 లక్షల ఎకరాల్లో వరి నర్సరీలు పెంచబడిన నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని,
రాష్ట్రవ్యాప్తంగా 85 లక్షల బస్తాలకు పైగా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులు యాప్ ద్వారా బుకింగ్ చేసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులను పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. రైతుల అవసరాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ తగిన నిల్వలను అందుబాటులో ఉంచుతోందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రైతులు యూరియా లభ్యతపై ఎలాంటి అపోహలు, ఆందోళనలకు గురికాకుండా అవసరమైన మేరకు మాత్రమే ఎరువులను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >
ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది
Posted On 2026-06-22 20:54:00
Readmore >
చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ
Posted On 2026-06-22 20:51:08
Readmore >
సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి
Posted On 2026-06-22 20:50:12
Readmore >
అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి
Posted On 2026-06-22 20:48:51
Readmore >
జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-22 20:47:06
Readmore >
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-22 20:09:38
Readmore >