| Daily భారత్
Logo




సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి

News

Posted on 2026-06-22 20:50:12

Share: Share


సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి

రక్తదానంతో ఆదర్శంగా నిలుస్తున్న వ్యవసాయ విస్తరణ అధికారి అశోక్ రెడ్డి

రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త,ఐవి ఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు

డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా లింగాపూర్ వాటర్ చెందిన భూమని నర్సవ్వ (75) కు కాలు ఆపరేషన్ నిమిత్తమై బి నెగెటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తాన్ని వ్యవసాయ విస్తరణ అధికారి అశోక్ రెడ్డి అందజేసి ప్రాణదాతగా నిలవడం జరిగిందని రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త,ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ అత్యధిక సభ్యత్వ నమోదు లోనే కాకుండా అవసరం ఉన్నవారికి కావలసిన రక్తాన్ని అందజేయడం,తల సేమియా బాధిత చిన్నారులకు రక్తదాన శిబిరాలను నిర్వహించడం,  జిల్లాకు చెందిన వ్యక్తులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ వైద్యశాలలో ఉన్న వారికి కావలసిన రక్తాన్ని సకాలంలో అందజేస్తూ ప్రాణాలను కాపాడడం జరిగిందని,సహకరిస్తున్న రక్తదాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.అశోక్ రెడ్డి వ్యవసాయ విస్తరణ అధికారిగా విధులను నిర్వహించడమే కాకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తాన్ని అందజేసిన ఆదర్శంగా నిలుస్తున్నారని గతంలో ఎన్నో సందర్భాల్లో గర్భిణీ మహిళల కోసం,వివిధ ఆపరేషన్ల నిమిత్తమై, ప్రమాద బాధితులకు,డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారికి రక్తాన్ని అందజేస్తూ మానవత్వాన్ని చాటుతున్న రక్తదాతకు అభినందనలు తెలియజేశారు.

Image 1

పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్

Posted On 2026-06-22 21:29:25

Readmore >
Image 1

నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్

Posted On 2026-06-22 21:24:09

Readmore >
Image 1

ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది

Posted On 2026-06-22 20:54:00

Readmore >
Image 1

మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కలిసిన టీయూడబ్ల్యూజే నాయకులు

Posted On 2026-06-22 20:52:39

Readmore >
Image 1

చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ

Posted On 2026-06-22 20:51:08

Readmore >
Image 1

సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి

Posted On 2026-06-22 20:50:12

Readmore >
Image 1

అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి

Posted On 2026-06-22 20:48:51

Readmore >
Image 1

జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-06-22 20:47:06

Readmore >
Image 1

పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల

Posted On 2026-06-22 20:28:54

Readmore >
Image 1

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-22 20:09:38

Readmore >