Posted on 2026-06-22 20:51:08
డైలీ భారత్, కామారెడ్డి: సమాజ సేవే లక్ష్యంగా పనిచేస్తున్న శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ, తన "నెలకు ఒక మంచి పని – నెలకు ₹100" నారాయణ సేవ కార్యక్రమంలో భాగంగా మరో సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులను కోల్పోయి నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నారి సహస్ర విద్యాభ్యాసానికి ఆర్థిక సహాయం అందించింది.
కామారెడ్డి పట్టణంలోని ప్రియా టాకీస్ రోడ్ ప్రాంతానికి చెందిన సహస్రను శ్లోక ఇన్నోవేటివ్ స్కూల్‌లో 5వ తరగతిలో చేర్పించి, ఆమె ఏడాది విద్యా ఖర్చులను భరించాలని సంస్థ నిర్ణయించింది. ఈ సందర్భంగా స్కూల్ ఫౌండర్ జాలిగామ శ్రీకాంత్ 50 శాతం ఫీజు మాఫీ చేసి చిన్నారికి అండగా నిలిచారు. ఇందుకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ వ్యవస్థాపకులు శ్రీకాంత్ దత్త ఆయనకు, స్కూల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు కే. సాయిరాం, ABN న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్, సిద్ధంశెట్టి వేణుగోపాల్, కే. శిరీష తదితరులు పాల్గొని సహస్రను పాఠశాలలో చేర్పించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీకాంత్ మాట్లాడుతూ, సమాజంలోని నిరుపేద విద్యార్థుల కోసం శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. సహస్ర విద్యలో మరింత ఉన్నత స్థాయికి చేరుకునేలా తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
అలాగే చిన్నారికి పుస్తకాలు అందించిన మచ్చ నాగరాజు కుటుంబ సభ్యులకు, శ్లోక స్కూల్ యాజమాన్యానికి, నారాయణ సేవ కార్యక్రమానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ తరఫున శ్రీకాంత్ దత్త హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పట్నంశెట్టి శ్రీనివాస్, కొడిప్యాక సాయిరాం, శిరీష, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >
ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది
Posted On 2026-06-22 20:54:00
Readmore >
చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ
Posted On 2026-06-22 20:51:08
Readmore >
సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి
Posted On 2026-06-22 20:50:12
Readmore >
అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి
Posted On 2026-06-22 20:48:51
Readmore >
జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-22 20:47:06
Readmore >
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-22 20:09:38
Readmore >