Posted on 2026-06-23 17:03:43
మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి..
వీర్నపల్లి కేజీబీవీ లో తనిఖీలో కలెక్టర్ గరిమ అగ్రవాల్..
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. వీర్నపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జిల్లా కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల హాజరు రిజిస్టర్ పరిశీలించారు. అక్కడి నుంచి కిచెన్ లోకి వెళ్లి బియ్యం నాణ్యతను తనిఖీ చేశారు. మెనూ చార్ట్ ప్రకారం ఈ రోజు ఏ ఏ ఆహార పదార్థాలు సిద్ధం చేస్తున్నారో పరిశీలించారు. స్టోర్ రూమ్ లో పప్పులు, నూనె, నెయ్యి, ఇతర పదార్థాల నాణ్యత, గడువు తేదీని తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నిల్వకు సంబంధించి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు కచ్చితంగా మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ... విద్యార్థులు అందరూ తరగతులకు హాజరయ్యాలా చూడాలని సూచించారు. విద్యార్థులు ప్రణాళిక ప్రకారం పాఠ్యాంశాలు శ్రద్ధగా చదువుకోవాలని తెలిపారు. పరిశీలనలో మండల ప్రత్యేక అధికారి క్రాంతి, తహసీల్దార్ నారాయణ రెడ్డి, సర్పంచ్ జ్యోత్స్న తదితరులు ఉన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >
కూలీలను కబళించిన ప్రమాదం.. టైరు పేలడంతో బోల్తాపడ్డ టాటా ఏస్, ముగ్గురు మృతి
Posted On 2026-06-23 12:14:31
Readmore >
నిజామాబాద్ లో ఎక్సైజ్ సూపరిండెంట్ ఇంట్లో ఏసీబీ అధికారుల దాడుల కలకలం
Posted On 2026-06-23 11:59:52
Readmore >
ఒలింపిక్ స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి : మంత్రి వాకిటి శ్రీహరి
Posted On 2026-06-23 11:09:19
Readmore >
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >