Posted on 2026-06-23 21:51:35
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎక్సైజ్ శాఖ సూపరిండెంట్ మల్లారెడ్డి నివాసంలో ఆయన ఉండే నివసించే ప్రాంతాలలో లంచాలకు మరిగి ఇష్టానుసారంగా ప్రజా సొమ్మును వేలల్లో లక్షల్లో సొమ్ము చేసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులను 10 బృందాలుగా సోదాలు నిర్వహించారు.ఏళ్లుగా లంచాలు తీసుకుంటూ వందల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టారు. తాజాగా నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి ఇళ్లలో సోదాలు చేసింది. ఆయన అక్రమాస్తులను చూసి ఏసీబీ అధికారులే షాక్కు గురయ్యారు ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు కావడంతో ఏసీబీ అధి కారులు మంగళవారం అతని నివాసంతో పాటు అతని బంధువులు, బినామీలు ఇతర సహచరులకు చెందిన మరో 10 ప్రదేశాలలో సోదాలు నిర్వహించారు. తనిఖీల సమయంలో ఏసీబీ అధికారులు మల్లారెడ్డి పేరిట 5 నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు. ఆయన పేరిట 8 ఖాళీ స్థలాలు, 10.23 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించారు. సుమారు రూ.3.31 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాలో రూ.50 లక్షలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ భార్య, అతని కుటుంబ సభ్యుల పేర్ల మీద 3 బ్యాంకు లాకర్లు ఉన్నట్లు అధికారులు అధికారులు తెలిపారు . వాటిని త్వరలో తెరవనున్నా రు. అవి తెరిస్తే మరిన్ని అక్రమాస్తుల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సోదాల సమయంలో అధికారులు నిందితుడి వద్ద ఒక గ్రాండ్ విటారా కారు, ఒక టీవీఎస్ స్కూటీ లభించాయి. ఈ మొత్తం ఆస్తుల విలువ రూ.3 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.100 కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు.
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >