Posted on 2026-06-27 19:10:17
డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట లో హిందూ సామ్రాజ్య దినోత్సవంని ఘనంగా నిర్వహించారు,ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకాన్ని పురస్కరించుకుని జరుపుకునే చారిత్రక మరియు సాంస్కృతిక వేడుక,ఈ విజయం భారతదేశంలో స్వరాజ్య స్థాపనకు,హిందూ ధర్మ రక్షణకు ప్రతీకగా నిలిచింది,విదేశీ దండయాత్రల సమయంలో,హిందూ రాజులందరినీ ఏకం చేసి,సార్వభౌమ హిందూ సామ్రాజ్యాన్ని (హిందవీ స్వరాజ్యం) స్థాపించిన ఘనత శివాజీకి దక్కుతుంది,ఈ పట్టాభిషేకం భారతీయుల ఆత్మగౌరవానికి శాశ్వత చిహ్నంగా మారింది,ఈ ఉత్సవాన్ని దేశ వ్యాప్తంగా అన్ని హిందు సంఘాలు,ముఖ్యంగా ఆర్.ఎస్.ఎస్ ప్రతి యేటా నిర్వహిస్తుంది,ఇది సంఘ శతాబ్ది సంవత్సరం కాబట్టి,హిందువులు సంఘటితంగా ఉండాలని,సనాతన ధర్మపరిరక్షణకు అందరు నడుం బిగించాలని పిలుపు నిస్తున్నారు,
ఈ కార్యక్రమంలొ దమ్మపేట మండల బిజెపి మాజీ అధ్యక్షులు దారా నాగేశ్వరావు ,రామదండు హిందూ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దా కొండయ్య ,బీజేపీ నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవిగారు,బిజెపి సోషల్ మీడియా సోయం వెంకటేశ్వరావు ,ఆర్ఎస్ఎస్ అశ్వారావుపేట శాఖ సహకార్యవాహక మట్టా శ్రీనివాసరావు,తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >