| Daily భారత్
Logo




సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

News

Posted on 2026-06-27 20:20:48

Share: Share


సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

డైలీ భారత్, హైదరాబాద్: ఏడేళ్ల బాలికను లైంగిక దాడి నుంచి సమయస్ఫూర్తితో రక్షించిన దంపతులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు అభినందించారు. బషీర్‌బాగ్‌లోని సీపీ కార్యాలయంలో శనివారం కొల్లాటి రమేష్, మువ్వాలమ్మ దంపతులను ఆయన శాలువాతో సత్కరించి, నగదు పురస్కారాన్ని అందజేశారు.

ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆడుకుంటున్న ఓ ఏడేళ్ల చిన్నారికి రూ.20 ఇస్తానని ఆశ చూపి, మహ్మద్ శంషుద్దీన్ (60) అనే రిక్షా కార్మికుడు తన రిక్షాపై ఎక్కించుకొని వెళ్లాడు. ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ క్రమంలో స్థానికంగా నివసించే రమేష్, మువ్వాలమ్మ దంపతులు నిందితుడి దుశ్చర్యను గమనించి తక్షణమే స్పందించారు. నిందితుడి బారి నుంచి బాలికను సురక్షితంగా రక్షించడమే కాకుండా, డ‌య‌ల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు మహ్మద్ శంషుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు మాట్లాడుతూ.. సమాజంలో నేరాల నియంత్రణకు పౌరుల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. ఇటువంటి అకృత్యాలకు అడ్డుకట్ట వేయాలంటే పోలీసుల నిఘాతో పాటు పౌరుల అప్రమత్తత కూడా అంతే ముఖ్యమ‌న్నారు. 'మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనిస్తూ ప్రతి పౌరుడూ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాధారణ పరిస్థితులు కనిపిస్తే తక్షణమే డ‌య‌ల్ 100 కి కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలి. ఆపదలో ఉన్న చిన్నారిని కాపాడటంలో రమేష్, మువ్వాలమ్మ దంపతులు చూపిన చొరవ, సమయస్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలి" అని అన్నారు. 

ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ డీసీపీ రమణా రెడ్డి, బోరబండ ఎస్‌హెచ్‌ఓ ఇన్‌స్పెక్టర్ సురేందర్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

Posted On 2026-06-28 19:08:04

Readmore >
Image 1

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

Posted On 2026-06-28 11:57:52

Readmore >
Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >
Image 1

పట్టుబడిన / సీజ్ చేసిన 687 కిలోల గంజాయిని దహనం

Posted On 2026-06-27 18:49:05

Readmore >