Posted on 2026-06-29 23:17:29
డైలీ భారత్, అశ్వారావుపేట: అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్న ఏసీబీ అధికారులు మరో అధికారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న శ్రీనివాస్ అనే అధికారి రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా ఖమ్మం రేంజ్ ఏసీబీ అధికారులకు చిక్కాడు
అశ్వారావుపేట మండలానికి చెందిన ఓ రైతు తన పొలంలో, అశ్వారావుపేట పట్టణంలోని దొంతి కుంట చెరువు నుండి మట్టి తోలుకునేందుకు అనుమతి కోసం ఇరిగేషన్ కార్యాలయానికి వెళ్లాడు. అయితే అక్కడ పనిచేస్తున్న శ్రీనివాస్ అనుమతి ఇచ్చేందుకు రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేశాడు.
దీంతో బాధిత రైతు ఖమ్మం రేంజ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. రైతు ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ పక్కా ప్లాన్‌తో వలపన్నారు.
ప్లాన్ ప్రకారం బాధిత రైతు శుక్రవారం శ్రీనివాస్ కార్యాలయానికి వెళ్లి రూ.2 లక్షలు ఇస్తుండగా, ముందుగానే అక్కడ మాటువేసిన ఏసీబీ అధికారులు దాడి చేసి శ్రీనివాస్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం డబ్బును స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులపై కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. నిందితుడిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ దాడుల్లో ఖమ్మం రేంజ్ ఏసీబీ డీఎస్పీ వై. రమేష్‌తో పాటు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ *1064* కు గానీ, వాట్సాప్ నంబర్ *9440446106* కు గానీ ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >