Posted on 2026-07-08 19:27:58
కబ్జాలను తొలగించి 6 గుంటల భూమికి హైడ్రా ఫెన్సింగ్
డైలీ భారత్, హైదరాబాద్: పోలీసు స్టేషన్కు కేటాయించిన స్థలాన్ని హైడ్రా కాపాడింది. రంగారెడ్డి జిల్లా, ఉప్పల్ మండలం, కొత్తపేట్ గ్రామంలోని సర్వే నంబర్లు 135, 136లో 6 గుంటల స్థలాన్ని చైతన్యపురి పోలీస్ స్టేషన్కు కేటాయించారు. సర్వే నంబర్ 135లో 4 గుంటలు, సర్వే నంబర్ 136లో 2 గుంటలు కలిపి మొత్తం 6 గుంటల భూమిని పోలీసు స్టేషన్ ఏర్పాటుకు నిర్ణయించారు. సర్వే నంబర్ 135లోని 4 గుంటల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకుని షెడ్లు నిర్మించారు. ఆక్రమణలు తొలగించి పోలీసు స్టేషన్కు కేటాయించిన భూమిని కాపాడాలని హైడ్రాను పోలీసు శాఖ కోరింది. హైడ్రా అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి కబ్జాలను నిర్ధారించుకుంది. బుధవారం హైడ్రా బృందాలు రంగంలోకి దిగి షెడ్డులను తొలగించింది. ఆక్రమణలు మళ్లీ జరగకుండా సర్వే నంబర్లు 135, 136లోని మొత్తం 6 గుంటల స్థలానికి హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. పోలీసు స్టేషన్ కోసం కేటాయించిన భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >