Posted on 2026-07-10 03:55:48
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్‌లో ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ ఏర్పాటు చేసిన అత్యాధునిక సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం యూనిట్‌లోని వివిధ ఉత్పత్తి విభాగాలను పరిశీలించి తయారీ ప్రక్రియను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. "తెలంగాణ రైజింగ్–2047" విజన్‌తో రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందన్నారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించేందుకు అత్యాధునిక మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అనుకూల విధానాలు, వేగవంతమైన అనుమతుల వ్యవస్థను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాలను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తూ, ఆధునిక పారిశ్రామిక మండలాల ఏర్పాటు, సేవా రంగ విస్తరణ, రవాణా మౌలిక సదుపాయాల బలోపేతంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. యువతకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీ, అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లు, పాలిటెక్నిక్ కళాశాలలు, ఐటీఐలను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు.సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా సౌరశక్తి వినియోగాన్ని విస్తరిస్తూ పర్యావరణ హిత పారిశ్రామికీకరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రీమియర్ ఎనర్జీస్ వంటి సంస్థలు రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరుతూ, పరిశ్రమలకు అవసరమైన అన్ని విధాల సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు.సీతారాంపూర్‌లో పరిశ్రమ ఏర్పాటుతో భూములు కోల్పోయిన కుటుంబాల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. అర్హులైన వారికి ఇంటి పట్టాలు, ఉపాధి అవకాశాలు, వ్యాపార సముదాయాల ఏర్పాటు వంటి చర్యలను వేగవంతం చేయాలని సూచించారు.రంగారెడ్డి జిల్లా రైతులు చేసిన త్యాగాల వల్లే ఈ పారిశ్రామిక అభివృద్ధి సాధ్యమైందని ముఖ్యమంత్రి కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం
కట్టుబడి ఉందని తెలిపారు.రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, ఉత్పత్తి కేంద్రంగా తెలంగాణను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ కేవలం 12 నెలల్లో 75 ఎకరాల్లో అత్యాధునిక తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేశాయని తెలిపారు.జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పునరుత్పాదక ఇంధన రంగానికి డిమాండ్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం, నూతన ఇంధన విధానం, ఓపెన్ యాక్సెస్ విధానం, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, సబ్సిడీల అమలు ద్వారా మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని మంత్రి వెల్లడించారు.జహీరాబాద్‌లో జాతీయ పారిశ్రామిక తయారీ మండలి ఏర్పాటు, పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, స్వచ్ఛ ఇంధన రంగాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. "తెలంగాణ రైజింగ్–2047" విజన్‌లో భాగంగా రాష్ట్రాన్ని క్లీన్ ఎనర్జీ, అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్, ఇన్నోవేషన్, సుస్థిర అభివృద్ధికి ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ యాజమాన్యాన్ని మంత్రి అభినందిస్తూ, రాష్ట్ర అభివృద్ధిలో పరిశ్రమల భాగస్వామ్యం మరింత పెరగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు,రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి,ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మనోహర్ రెడ్డి, టీజీఐఐసీ ఛైర్మన్ నిర్మల జగ్గారెడ్డి,చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామెన భీమ్ భారత్,ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రీమియర్ ఎనర్జీస్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Posted On 2026-07-10 03:55:48
Readmore >
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >