| Daily భారత్
Logo




నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు

News

Posted on 2026-07-30 17:36:26

Share: Share


నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు

డైలీ భారత్, హైదరాబాద్ (చైతన్యపురి):తెలంగాణ పోలీసుల తక్షణ స్పందన, అంకితభావం మరోసారి రుజువైంది. ఆత్మహత్యే శరణ్యమనుకుని ముగ్గురు పసిపిల్లలతో సహా ముసీ నదిలోకి దూకేందుకు ప్రయత్నించిన ఒక మహిళను చైతన్యపురి పోలీసులు అత్యంత చాకచక్యంగా రక్షించారు. డయల్-100కు అందిన సమాచారంతో కేవలం 4 నిమిషాల వ్యవధిలోనే ఘటనాస్థలికి చేరుకుని, సమయస్ఫూర్తితో వ్యవహరించి నలుగురి ప్రాణాలను కాపాడారు. 

ఘటన వివరాల్లోకి వెళితే... 

తీవ్ర మనస్తాపానికి గురైన ఒక మహిళ, తన ముగ్గురు పిల్లలను తీసుకుని ముసీ నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో నది వద్దకు చేరుకుంది. ఆ సమయంలో అక్కడున్న కొందరు గమనించి వెంటనే పోలీసు అత్యవసర విభాగం "డయల్-100"కు సమాచారం అందించారు.

సమాచారం అందిన వెంటనే చైతన్యపురి పెట్రోల్ మొబైల్-I సిబ్బంది రంగంలోకి దిగారు. కంట్రోల్ రూమ్ అలర్ట్ ఆధారంగా వాహనంలో ఉన్న ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ (WPC) ఎం. చంద్రకళ, హోంగార్డ్ (HG) జె. బాలరాజు క్షణాల వ్యవధిలో స్పందించారు. అత్యంత వేగంగా ప్రయాణించి, కేవలం 4 నిమిషాల్లో ఘటనాస్థలికి చేరుకున్నారు.

హైడ్రా (HYDRAA) బృందంతో కలిసి సంయుక్త ఆపరేషన్... 

పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి ఆ మహిళ పిల్లలతో సహా నదిలోకి దూకేందుకు సిద్ధంగా ఉంది. ఏమాత్రం ఆలస్యం చేసినా పెద్ద ప్రమాదం జరిగే పరిస్థితి నెలకొంది. దీంతో పెట్రోల్ మొబైల్ సిబ్బంది అక్కడే విధుల్లో ఉన్న హైడ్రా (HYDRAA) ప్రత్యేక బృందంతో చేతులు కలిపారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చాకచక్యంగా ముందుకు ఉరికి, నదిలోకి దూకబోతున్న మహిళను, ఆమె ముగ్గురు అమాయక పిల్లలను సురక్షితంగా వెనక్కి లాగి రక్షించారు.

కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగింత... 

సురక్షితంగా రక్షించిన అనంతరం, తీవ్ర భయాందోళనలో ఉన్న బాధితులకు చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో ఆశ్రయం కల్పించారు. నలుగురి ప్రాణాలు కాపాడిన అనంతరం, చైతన్యపురి పోలీస్ అధికారులు సదరు మహిళకు, కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహించారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని, పిల్లల భవిష్యత్తును నాశనం చేయవద్దని నచ్చజెప్పారు. అనంతరం బాధితులను వారి కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు పోలీసులకు కన్నీటి పర్యంతమై కృతజ్ఞతలు తెలిపారు.

కమిషనర్ ప్రశంసల జల్లు... 

సమయస్ఫూర్తితో, మెరుపు వేగంతో స్పందించి నాలుగు అమాయక ప్రాణాలను కాపాడిన చైతన్యపురి పెట్రోల్ మొబైల్ సిబ్బంది WPC చంద్రకళ, HG బాలరాజులను రాచకొండ/మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు. విధి నిర్వహణలో ఇలాంటి మానవీయ కోణం, తక్షణ స్పందన పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచుతుందని సీపీ కొనియాడారు. ప్రజల ప్రాణాల రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న సిబ్బందికి రివార్డులను కూడా ప్రకటించారు.

Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >
Image 1

బిజెపి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ

Posted On 2026-08-11 14:02:10

Readmore >