| Daily భారత్
Logo




లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..

News

Posted on 2026-07-31 12:56:48

Share: Share


లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..

డైలీ భారత్, హైదరాబాద్: లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా శుక్రవారం నిర్వహించిన శిఖర పూజ, ధ్వజారోహణ కార్యక్రమాల్లో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా బోనాల సందర్భంగా హైదరాబాద్ సీపీని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. 

నగర సీపీ సజ్జనర్ మాట్లాడుతూ లాల్‌దర్వాజా ఆలయ ఘనమైన చరిత్రను గుర్తు చేస్తూ.. గత 120 సంవత్సరాలుగా ఆషాఢ మాసంలో బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోందని వివరించారు. ఇప్పటికే గోల్కొండ, బల్కంపేట బోనాల ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాయని ఆయన తెలిపారు.  లాల్‌దర్వాజా బోనాలను కూడా అదే రీతిలో విజయవంతం చేసేందుకు జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్, విద్యుత్, ఆర్‌అండ్ బి తదితర శాఖలతో ఇప్పటికే సమన్వయ సమావేశాలు నిర్వహించామన్నారు. సౌత్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో అదనపు బలగాలతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామన్నారు.

అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. 2 వేల మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఈవ్‌టీజింగ్, చైన్ స్నాచింగ్‌లు, జేబు దొంగతనాలు జరగకుండా క్రైమ్ విభాగం, "షీ టీమ్స్"  ద్వారా 24 గంటలూ ప్రత్యేక నిఘా ఉంచుతున్నామని వివరించారు.. బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా, సంతోషకరమైన వాతావరణంలో జరిగేలా భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పోలీసు శాఖకు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమాల్లో అదనపు సీపీ సౌత్ రేంజ్ తఫ్షిర్ ఇక్బాల్, ఐపీఎస్, చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్, ఐపీఎస్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ సత్యనారాయణ, ఎండో మెంట్ అసిస్టెంట్ కమిషనర్, ఫెస్టివల్ చీఫ్ ఆఫీసర్ ఈ.శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >
Image 1

బిజెపి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ

Posted On 2026-08-11 14:02:10

Readmore >