Posted on 2026-07-31 13:26:11
డైలీ భారత్, నర్సంపేట: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిన యోధుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మృతి పట్ల బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
సుదర్శన్ రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడి గెలిచి తిరిగి వస్తారని మనమందరం ఎదురుచూశామని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.ఆయన ఇక మన మధ్య లేరన్న వార్త బాధాకరమన్నారు.
తెలంగాణ ఉద్యమంలో సుదర్శన్ రెడ్డి అగ్రభాగాన నిలిచి పోరాడారని,పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, నర్సంపేట నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిరంతరం కృషి చేశారని ఎంపీ రవిచంద్ర చెప్పారు.
ఆయన అకాల మృతి పార్టీకి, నర్సంపేట నియోజకవర్గానికి, తెలంగాణ సమాజానికి తీరని లోటు అన్నారు. పెద్ది తనకు ఆప్త మిత్రుడు అని,సన్నిహితులని,ఆయన మరణం పట్ల ఎంపీ రవిచంద్ర తీవ్ర సంతాపం ప్రకటించారు.
సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులకు ఎంపీ వద్దిరాజు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పెద్ది ఇక లేరనే విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆయన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ప్రసాదించాలని ఎంపీ రవిచంద్ర కోరుకున్నారు.
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >