Posted on 2026-07-31 14:29:33
డైలీ భారత్, న్యూఢిల్లీ / భద్రాద్రి కొత్తగూడెం: తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం, దుద్దుకూరు గ్రామ పంచాయతీ పరిధిలోని మేరీమాత ఆలయం పరిసర ప్రాంతాల్లో స్టోన్ క్రషర్ మరియు గ్రానైట్ ప్రాసెసింగ్ యూనిట్ల వల్ల ఏర్పడుతున్న వాయు కాలుష్యంపై డా. మద్దిశెట్టి సామేలు జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC), న్యూఢిల్లీకి సమర్పించిన ఫిర్యాదుపై కమిషన్ స్పందించింది.
ఈ ఫిర్యాదును పరిశీలించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC), కేసు నం. 8121/15/2026 కింద నమోదు చేసి, 30-07-2026 తేదీన ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB) చైర్మన్‌కు తదుపరి విచారణ, తగిన చర్యల కోసం అధికారికంగా పంపించింది.
ఫిర్యాదులో, మేరీమాత ఆలయం పరిసర ప్రాంతాల్లో స్టోన్ క్రషర్, గ్రానైట్ యూనిట్ల కార్యకలాపాల వల్ల భారీగా దుమ్ము, ధూళి వ్యాపించి ఆలయానికి వచ్చే వేలాది మంది భక్తులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ కాలుష్యం కారణంగా శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు, చర్మవ్యాధులు పెరుగుతున్నాయని, రహదారి పక్కన ఉన్న చెట్లు దుమ్ముతో కప్పబడి వాటి పెరుగుదల దెబ్బతింటోందని, వ్యవసాయ పంటలు కూడా నష్టపోతున్నాయని ఫిర్యాదులో వివరించారు.
ఈ నేపథ్యంలో సంబంధిత ప్రాంతంలో తక్షణమే క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించి, కాలుష్యానికి కారణమవుతున్న యూనిట్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కఠిన నియంత్రణ చర్యలు లేదా కార్యకలాపాల నిలిపివేతను కూడా పరిశీలించాలని డా. మద్దిశెట్టి సామేలు కోరారు.
జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఎనిమిది వారాల్లో తగిన చర్యలు తీసుకొని, చేపట్టిన చర్యలపై కమిషన్‌తో పాటు ఫిర్యాదుదారునికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.
ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ మరియు భక్తుల భద్రత దృష్ట్యా సంబంధిత అధికారులు ఈ అంశంపై వేగంగా స్పందించి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని డా. మద్దిశెట్టి సామేలు విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >